Jagan Air port incident : ఆగంతకుడు కాదు…ఎన్నారై డాక్టర్ …ఏపీ పోలీసులపై అమెరికా ఎంబసీకి ఫిర్యాదు
ఏపీ సీఎం జగన్ లండన్ వెళ్ళే ముందు ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీఐపీ మూవ్ మెంట్ ఉన్న టైమ్ లో అనుమానస్పదంగా తచ్చాడుతుండటంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. కానీ అతను అమెరికా పౌరసత్వం కలిగిన ఎన్నారై డాక్టర్ లోకేశ్ కుమార్. పోలీసుల కిడ్నాప్, వేధింపులపై అమెరికా ఎంబసీకి ఫిర్యాదు చేశారు.
ఏపీ సీఎం జగన్, కుటుంబంతో కలసి గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్ళారు. అయితే ఆ టైమ్ లో ఓ వ్యక్తి అనుమానస్పదంగా కనిపించాడంటూ అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ ఎయిర్ పోర్టులో ఉన్నప్పుడు అతను చాలా దగ్గరగా వచ్చాడని పోలీసులు తెలిపారు. జగన్ టూర్ వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడనీ… వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడటంటూ పోలీసుల నుంచి లీకులు కూడా వచ్చాయి. తాము అదుపులోకి తీసుకున్నాక… గుండె నొప్పిగా ఉందంటే హాస్పిటల్ కి తరలించినట్టు పోలీసులు తెలిపారు.
తీరా చూస్తే… ఆయన ఎన్నారై డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ గా తేలింది. తనను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారనీ… కిడ్నాప్ చేసి వేధించారని డాక్టర్ చెబుతున్నారు. గుండె నొప్పి రావడంతో హాస్పిటల్ లో చేర్చినట్టు చెప్పారు. డాక్టర్ లోకేష్ కుమార్ ఉయ్యూరు టీడీపీ ఆఫీసులో కనిపించారు. టీడీపీ నేతలు దేవినేని ఉమతో పాటు పార్టీ నేతలు లోకేష్ తో మాట్లాడారు. గతం నుంచీ జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకు పోలీసులు తనను గుర్తుపట్టి అదుపులోకి తీసుకున్నట్టు లోకేశ్ చెబుతున్నారు. ఆ తర్వాత దాడి చేశారనీ… గుండె నొప్పి వస్తుందన్నా వినకుండా వేధించారని ఆరోపిస్తున్నారు. లోకేష్ కుమార్ అమెరికా పౌరుడు కావడంతో… పోలీసులపై ఆయన ఎంబసీతో పాటు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. తనను వేధించిన పోలీసులపై చర్యలు తీసుకునేదాకా… పోరాడతానని అంటున్నారు లోకేశ్ కుమార్.