Jagan Bangalore Tour: షర్మిల దెబ్బకు…. జగన్ బెంగళూరుకి జంప్ !

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మళ్ళీ బెంగళూరుకు వెళ్లారు. రెండు వారాల వ్యవధిలో ఇది రెండో ట్రిప్. గతంలో కాలికి తగిలిన దెబ్బకు ట్రీట్మెంట్ కోసం వెళ్ళారని వైసీపీ నేతల టాక్. మరో వారం రోజుల్లో ఏపీ అసెంబ్లీ స్టార్ట్ అవుతుంటే... ఇప్పుడెందుకు వెళ్ళారన్న ప్రశ్నలు వస్తున్నాయి. పైగా సోమవారం నుంచి ప్రజాదర్భార్ పెడతామన్న జగన్... ప్రారంభించకుండానే వాయిదా వేసి సడన్ గా కర్ణాటకకు వెళ్లిపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 15, 2024 | 03:06 PMLast Updated on: Jul 15, 2024 | 3:06 PM

Jagan Bangalore Tour Sharmila

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మళ్ళీ బెంగళూరుకు వెళ్లారు. రెండు వారాల వ్యవధిలో ఇది రెండో ట్రిప్. గతంలో కాలికి తగిలిన దెబ్బకు ట్రీట్మెంట్ కోసం వెళ్ళారని వైసీపీ నేతల టాక్. మరో వారం రోజుల్లో ఏపీ అసెంబ్లీ స్టార్ట్ అవుతుంటే… ఇప్పుడెందుకు వెళ్ళారన్న ప్రశ్నలు వస్తున్నాయి. పైగా సోమవారం నుంచి ప్రజాదర్భార్ పెడతామన్న జగన్… ప్రారంభించకుండానే వాయిదా వేసి సడన్ గా కర్ణాటకకు వెళ్లిపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలికి వైద్యం చేయించుకోడానికి హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఇల్లు ఉంది. అయినా ఇక్కడికి ఎందుకు రావట్లేదనే డౌట్స్ వస్తున్నాయి.
వైఎస్ కుటుంబానికి పులివెందులతో పాటు బెంగళూరు, హైదరాబాద్ లో ప్యాలెస్ లు ఉన్నాయి. లోటస్ పాండ్ ప్యాలెస్… వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కట్టిందే. ఉమ్మడి రాష్ట్రంలో పాలిటిక్స్ ఇక్కడి నుంచే నడిపించారు జగన్. రాష్ట్ర విభజన జరిగాక తాడేపల్లిలో మరో ప్యాలెస్ కట్టించుకున్నారు. ఆ మధ్య మాజీ సీఎం కేసీఆర్ ని చూడ్డానికి వచ్చినప్పుడు మాత్రమే లోటస్ పాండ్ కి వచ్చారు జగన్. మాజీ సీఎం అయ్యాక హైదరాబాద్ కి రావడం మానేశారు. జగన్ హైదరాబాద్ కి రాకపోవడానికి షర్మిలే కారణమని అంటున్నారు. లోటస్ పాండ్ లోనే వైస్సార్ తెలంగాణ పార్టీని ప్రారంభించిన షర్మిల… ఈ ప్యాలెస్ ను తన అధీనంలో తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆస్తుల్లో వాటాల కోసమే అన్న నుంచి విడిపోయిన షర్మిల… లోటస్ పాండ్ బిల్డింగ్ ఉమ్మడి ఆస్తి కావడంతో జగన్ కూడా ఏమీ మాట్లాడటం లేదు. ఈ ఆస్తిని చెల్లికి ఇవ్వడానికి ఒప్పుకున్నట్టు కూడా సమాచారం.
బెంగళూరులో జగన్ కి విలాసవంతమైన ప్యాలెస్ ఉంది. రాజకీయాల్లోకి రాకముందు ఈ ప్యాలెస్ లో ఉండే బిజినెస్ చూసుకునేవారు. వైఎస్సార్ సీఎం అయ్యాక తన వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా ఇక్కడి నుంచే విస్తరించారు. ఏపీ సీఎంగా ఉన్నప్పుడు చాలా తక్కువ సందర్భాల్లోనే జగన్ బెంగళూరు ప్యాలెస్ కు వెళ్ళారు. మాజీ అయ్యాక… అక్కడికే వెళ్ళక తప్పట్లేదు. లోటస్ పాండ్ ఇల్లు షర్మిల హ్యాండోవర్ లో ఉండటంతో… హైదరాబాద్ రావడానికి జగన్ ఇబ్బందిగా ఫీలవుతున్నట్టు సమాచారం. మరి ఉన్నట్టుంది జగన్ బెంగళూరుకు ఎందుకు వెళ్తున్నట్టు… అంటే… జగన్ సీఎంగా ఉన్నప్పుడు కాలికి గాయమైంది. దానికి వైద్యం చేయించుకోడానికి వెళ్ళారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రెండు వారాల క్రితం వెళ్ళినప్పుడు కాంగ్రెస్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తో భేటీ అయినట్టు వార్తలు వచ్చినా… ఆయన ఖండించారు. ఇప్పుడు కూడా షర్మిలను కాస్త అదుపులో పెట్టమని శివకుమార్ ని రిక్వెస్ట్ చేసేందుకు బెంగళూరు వెళ్ళినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ వైసీపీ వర్గాలు మాత్రం… ఈ టూర్ వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదంటున్నారు.