JAGAN KEJRI BUILDINGS : పాయె.. జగన్ పరువు పాయె.. ఉతికారేస్తున్న నేషనల్ మీడియా

ఏపీకి మరో 30యేళ్ళ పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని పగటి కలలు కన్న జగన్మోహన్ రెడ్డి... విశాఖ రుషికొండలో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు. 500 కోట్లతో విలాసవంతమైన రాజ మహల్ ను నిర్మించుకోవడంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 20, 2024 | 12:40 PMLast Updated on: Jun 20, 2024 | 12:40 PM

Jagan Mohan Reddy Had A Day Dream That He Would Be The Chief Minister Of Ap For Another 30 Years

 

 

ఏపీకి మరో 30యేళ్ళ పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని పగటి కలలు కన్న జగన్మోహన్ రెడ్డి… విశాఖ రుషికొండలో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు. 500 కోట్లతో విలాసవంతమైన రాజ మహల్ ను నిర్మించుకోవడంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. దాదాపు అన్ని నేషనల్ మీడియా ఛానెళ్ళు… జగన్ తీరును ఉతికి ఆరేస్తున్నాయి. నిపుణులు, రాజకీయ పార్టీల నేతలు, సామాజికవేత్తలతో డిబేట్స్ కండక్ట్ చేస్తున్నాయి.
జనం కష్టపడి సంపాదించిన సొమ్మును ట్యాక్సుల రూపంలో వసూలు చేసి… వాటిని జల్సాల కోసం ఖర్చుపెడతారా అని నెటిజెన్లు జగన్ పై మండిపడుతున్నారు. బాత్ టబ్, కమోడ్ కు లక్షల రూపాయలు తగలెయ్యడమేంటి..? 2,3 వేలు పెడితే వచ్చే వాటికి కూడా అంత కాస్ట్ పెట్టాలా… బాత్ టబ్ లో స్నానం కాకుండా ఇంకేమైనా చేస్తారా ? అంటూ నిలదీస్తున్నారు. 36 లక్షల బాత్ టబ్ అవసరమా… షవర్ తో స్నానం చేయలేరా… కావాలంటే ఇంకా పెద్ద షవర్ పెట్టుకున్నా… 5 వేలు కూడా కాదు… అని రిపబ్లికన్ టీవీ ప్రతినిధులు కామెంట్ చేశారు. రుషికొండ ప్యాలెస్ ను… ఢిల్లీలోని కేజ్రీవాల్ నిర్మించిన శీష్ మహల్ తో పోలుస్తోంది నేషనల్ మీడియా… అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసంలో మార్పులు, చేర్పులకు 44 కోట్లు ఖర్చుపెట్టారని బీజేపీ ఆరోపిస్తోంది. దానిపై అక్కడ తీవ్ర దుమారం రేగుతోంది. నార్త్ లో కేజ్రీవాల్… సౌత్ లో జగన్ దుమ్ము దులిపేస్తున్నారు.

జగన్ తాను 30యేళ్ళు అత్యంత వైభగంగా గడపడానికి ఈ మహల్ నిర్మించారని ఎండగడుతోంది నేషనల్ మీడియా. కొన్ని ఛానెళ్ళు సద్ధాం హుస్సేన్ భవనంతో పోలుస్తున్నాయి. ఈ చర్చలో పాల్గొంటున్న వైసీపీ నేతలు… జగన్ పరువును మరింత తీస్తున్నారు. వాటిని రాష్ట్రపతి, ప్రధాని లాంటి వాళ్ళ కోసం కట్టామని అడ్డగోలుగా సమర్థించుకుంటున్నారు. పర్యాటకుల కోసం కట్టామని మరికొందరు చెబుతున్నారు. అయితే విశాఖకు వచ్చే రాష్ట్రపతి, ప్రధాని కోసం… బాత్రూమ్ లో స్పా ఎందుకు పెట్టించారని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. జగన్ కోసం కాదు… సామాన్యుల కోసమని ఓ వైసీపీ నేత చెబితే… 36 లక్షల బాత్ టబ్ లో సామాన్యులు స్నానం చేస్తారా ? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అటు సోషల్ మీడియాలోనూ జగన్ ను ఓ ఆటాడుకుంటున్నారు. భారత పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ఖర్చు 971 కోట్లు అయ్యాయి. రుషికొండ ప్యాలెస్ కి 500 కోట్లు ఎలా ఖర్చుపెట్టారని ప్రశ్నిస్తున్నారు నెటిజెన్స్. లోక్ సభ, రాజ్యసభ సమావేశాల కోసం 1200 మంది సభ్యులకు సరిపడేలా పార్లమెంట్ బిల్డింగ్ కట్టారు. అలాంటిది జగన్ కుటుంబ సభ్యులు నలుగురు కోసం అన్ని కోట్లు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఎవడబ్బ సొమ్మని జనం డబ్బులతో జల్సాలు చేసుకోవాలని చూస్తున్నారని నెటిజెన్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. సినిమాల్లో వచ్చిన క్లిప్పింగ్స్ పెట్టి మీమ్స్ పేలుస్తున్నారు.