Jagan Praja Durbar : నేడు పులివెందులలో జగన్ ప్రజాదర్బార్..
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ ఇవాళ పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.

Jagan Praja Durbar in Pulivendulu today..
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ ఇవాళ పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. తన క్యాంపు కార్యాలయంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రజలు, పార్టీ శ్రేణులకు జగన్ భరోసా కల్పించనున్నారు. అయితే.. నిన్న వైఎస్ జగన్ పులివెందులకు చేరుకున్నారు. కాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వైఎస్ జగన్ ప్రజలకు అందుబాటులో ఉన్నారు.
ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వినతిపత్రం స్వీకరిస్తు న్నారు. కాగా తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని జగన్ అప్యాయంగా పలికరిస్తూ వారికి ఫోటో దిగి పంపిస్తున్నారు. మరోవైపు తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలు. ఎన్నికల ముందుగానే బిల్లులు విడుదల చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదెమో అని అభిప్రాయా పడుతున్నారు.
వైఎస్ జగన్ ఇంటికి వచ్చిన ఆయన కారు దిగి ఇంట్లోకి వెళ్లి పోతున్న సమయంలో ఓ వ్యక్తి జగన్ మీదకు దూసుకొచ్చాడు. వెంటనే భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పక్కకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సదరు వ్యక్తి.. జగన్‌ను కలవడానికి వచ్చినట్టు సమాచారం..