లోకేష్ పై ‘పళ్ళు’ నూరుతున్న ‘ఐపిఎస్’లు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 15, 2024 | 06:18 PMLast Updated on: Aug 15, 2024 | 6:18 PM

Jagan Pro Ips Officers Fired On Lokesh

16 మంది ఐపిఎస్ లు… అందులో ఇద్దరు డీజీలు, మరికొందరు ఐజిలు, మరికొందరు ఎస్పీ ర్యాంకు… సాధారణంగా ఈ ర్యాంకులు ఉన్న అధికారులు పోలీసు శాఖలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తారు. కానీ… కానీ…కానీ వెయిటింగ్ రూమ్ లో కూర్చోండి, సంతకాలు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేయండి అంటే…? ఒళ్ళు మండిపోద్ది… కాదు తగలబడిపోద్ది. ఇప్పుడు ఏపీలో కొందరు ఐపిఎస్ లకు తల నుంచి అరికాలు వరకు బీపీ ఓ రేంజ్ లో పెరిగిపోతుంది. మాకు ఏంట్రా ఈ ఖర్మ అంటూ ఐపిఎస్ అధికారులు కారాలు మిర్యాలు నూరుతున్నారు.

వాళ్లకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో… వాళ్లకు ఒక అవగాహన ఉంది. లేకపోతే అంత సాధారణంగా ఆల్ ఇండియా సర్వీసుల్లో ఉన్న అధికారులతో ప్రభుత్వాలు గోక్కునే ప్రయత్నం చేయవు. కాని చంద్రబాబు సర్కార్ చేసింది. మాకు కానిస్టేబుల్ అయినా ఎస్పీ అయినా ఒకటే అని చెప్పిన మాటను చంద్రబాబు నిజం చేస్తున్నారు. వైసీపీ నేతలపై ఉన్న కేసులను నీరు గార్చే ప్రయత్నం చేసారు కాబట్టి ఐపిఎస్ లు రోజూ వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేయాలని చెప్పారు. డీజీపీ ఆదేశాలు కాబట్టి పాటించాల్సిందే.

ఆదేశాలు ఇచ్చింది డీజీపీ… కాని ఐపిఎస్ లు పళ్ళు నూరుతుంది మాత్రం మంత్రి లోకేష్ పై. జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు లోకేష్ ఒక మాట అన్నారు. రెడ్ బుక్ అమలు ఇంకా జరగలేదు గాని… కచ్చితంగా జరుగుతుంది అని… రాజకీయ నాయకులకు ఆ సినిమా అర్ధమైంది. పెద్దిరెడ్డి, జోగి, కారుమూరి, వల్లభనేని, ద్వారంపూడి ఇలా కొందరికి బొమ్మ ఆల్రెడీ కనపడుతుంది. కొందరు ఆల్ ఇండియా సర్వీసు అధికారులకు ముందే అర్ధమై వీఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోయారు. అందులో 13 ఏళ్ళ సర్వీసు ఉన్న ప్రవీణ్ ప్రకాష్ కూడా ఒకరు.

కాని వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేసే 16 మంది మాత్రం పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఈ ఆదేశాలు వచ్చేసాయి. దీని వెనుక ఉన్నదీ లోకేష్ అనేది ఐపిఎస్ ల భావన. తాము ఏం చేస్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, మాతో ఎవరు మాట్లాడుతున్నారు, మేము ఎక్కడ తిరుగుతున్నాం… ఇలా అన్నీ లోకేష్ తెలుసుకునే మమ్మల్ని ఈ స్థితికి తెచ్చారని ఐపిఎస్ లకు మండిపోతుంది. వాళ్ళు అవునన్నా కాదన్నా… జగన్ ప్రభుత్వంలో వాళ్ళదే ఇష్టా రాజ్యం. జగన్ ఏం చెప్తే అది వెనుకా ముందు చూడకుండా చేసారు. ఎవరిని అరెస్ట్ చేయమంటే వాళ్ళను అరెస్ట్ చేసి బొక్కలో తోసారు.

ఇప్పుడు లోకేష్ టైం వచ్చింది. అందుకే లోకేష్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసారు. ఐపిఎస్ లకు ఈ 5 ఏళ్ళు పోస్టింగ్ వచ్చే అవకాశం జీరో అనేది ప్రభుత్వ వర్గాల మాట. అందులో నలుగురిని జైలుకి పంపే ప్లాన్ కూడా రెడీ గా ఉంది. అసలు ఇప్పుడు ఈ 16 మందేనా లేక ఇంకా లిస్టు ఉందా అంటే… కచ్చితంగా ఉందట. అందులో ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. కలెక్టర్లుగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారట. ఇప్పుడు వాళ్ళందరి మీద లోకేష్ నిఘా ఉంది. అందుకే సచివాలయానికి వెళ్ళినా, డీజీపీ ఆఫీసుకి వెళ్ళినా అధికారులకు చెమటలు పడుతున్నాయి.

కొందరు అధికారులు అయితే మా మీద నమ్మకం లేనప్పుడు పోస్టింగ్ ఇవ్వడం ఎందుకు అండి అంటూ తోటి అధికారుల వద్ద వాపోతున్నారు. చివరికి మంత్రుల దగ్గర పని చేసే అధికారులు సైతం లోకేష్ నిఘా టీం దెబ్బకు వణికిపోతున్నారు. విధుల్లో ఉన్న అధికారులు పెట్టిన సంతకాలపై అంతర్గత విచారణ జరగడం మొదలయింది. డీడీఆర్ బాండ్లు, పౌరసరఫరాల శాఖలో లొసుగులు, ఫ్రీ హోల్డ్ భూములు, ప్రభుత్వ భూముల కబ్జాలు… ఇలా ఎన్నో ఎన్నో అంతర్గత విచారణలో ఉన్న అంశాలు. మొన్నటికి మొన్న ఒక ఎమ్మార్వోని అరెస్ట్ చేసారు. త్వరలో ఐఏఎస్ ఉండొచ్చు, ఐపిఎస్ ఉండొచ్చు… ఎవరిని అయినా లోపల వేయొచ్చు. అధికారులు సెట్ అయితే అందరూ సెట్ అవుతారని, భవిష్యత్తులో జాగ్రత్తగా ఉంటారని లోకేష్ పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగారు. అందుకే ఐపిఎస్ అధికారులకు, ఇతర అధికారులకు లోకేష్ అనే పేరు వినపడితే ఒళ్ళు మండుతుంది. ఫైనల్ గా ఎవడు చేసిన కర్మకు వాడే బాధ్యుడు.