AP CM Jagan : సలహాదారులకు దోచిపెడుతున్న జగన్.. అంగన్వాడీల జీతాలకు డబ్బుల్లేవా ?

ఆంధ్రప్రదేశ్ లో జీతాలు పెంచాలంటూ మూడు వారాలుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. ఆ ఒక్కటి తప్ప అన్నట్టుగా... జీతాలు పెంచడం తప్ప వేరే ఏ సమస్య అయినా తీరుస్తామని జగన్ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు మున్సిపల్ కార్మికులు... ఆ తర్వాత కాంట్రాక్ట్ వర్కర్లు... ఇలా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక్కో ప్రభుత్వ విభాగానికి చెందిన ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 2, 2024 | 01:31 PMLast Updated on: Jan 02, 2024 | 1:31 PM

Jagan Robbing Advisors No Money For Salaries Of Anganwadis

ఆంధ్రప్రదేశ్ లో జీతాలు పెంచాలంటూ మూడు వారాలుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. ఆ ఒక్కటి తప్ప అన్నట్టుగా… జీతాలు పెంచడం తప్ప వేరే ఏ సమస్య అయినా తీరుస్తామని జగన్ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు మున్సిపల్ కార్మికులు… ఆ తర్వాత కాంట్రాక్ట్ వర్కర్లు… ఇలా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక్కో ప్రభుత్వ విభాగానికి చెందిన ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. అయితే 50 మంది సలహాదారులకు లక్షల్లో జీతాలు ఇస్తున్న సీఎం జగన్… రోజు మొత్తం కష్టపడి పనిచేసే ఉద్యోగులకు మాత్రం ఎందుకు జీతాలు పెంచడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

ఏపీలో అంగన్ వాడీలు సమ్మె మొదలుపెట్టి మూడు వారాలవుతోంది. మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెకు దిగారు. మరికొందరు ఉద్యోగులు కూడా ఇదే బాట పడుతున్నారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం… జీతాల సంగతి తప్ప ఏవైనా మాట్లాడాలని అంటోంది. కానీ వైసీపీ ప్రభుత్వానికి 50 మంది దాకా సలహాదారులు ఉన్నారు. ఒక్కొక్కరికి ప్రతి నెలా 2 లక్షల జీతంలో పాటు ఇతర అలెవెన్సులు ఇస్తున్నారు. వీళ్ళల్లో ముగ్గురో, నలుగురో యాక్టివ్ గా కనిపిస్తున్నారే తప్ప… మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు… ప్రభుత్వానికి ఏం సలహాలు ఇస్తున్నారన్నది అర్థం కాని ప్రశ్న. సలహాదారుల కోసం గత నాలుగున్నరేళ్ళల్లో మొత్తం 400 కోట్ల రూపాయల దాకా జగన్ ప్రభుత్వం ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. ఉద్యోగులకు సరిగా జీతాలు ఇవ్వలేని పరిస్థితులు దోచి పెడుతోందన్న విమర్శలు వస్తున్నాయి.

వివిధ రంగాల్లో మంచి అనుభవం ఉండి… రాజకీయాల్లోకి రాలేని వారిని మాత్రమే గతంలో ప్రభుత్వ సలహాదారులుగా నియమించేవారు. వారు ప్రభుత్వ అధికారులతో సమన్వం చేసుకుంటూ ప్రభుత్వానికి విలువైన సలహాలు అందించేవారు. కానీ ఇప్పుడు ఏ రంగంలో ఎలాంటి అనుభవం లేకపోయినా…వాడు మనోడే అని పప్పూ బెల్లాల్లా గవర్నమెంట్ అడ్వైజర్ పోస్టులను పంచిపెట్టారన్న విమర్శలున్నాయి. దీనిపై ఏపీ హైకోర్టు కూడా జగన్ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. అయినా వాళ్ళనే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు జగన్.

ఇప్పటిదాకా ఏపీ ప్రభుత్వంలో ఉన్న 50 మంది సలహాదారుల్లో అసలు ఎవరు ఏం సలహా ఇచ్చారన్నది మాత్రం తెలియదు. ఈ 50 మందిలో సీఎం నిర్వహించే సమావేశాల్లో ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప మరెవరికీ పాల్గొన్నఅవకాశం ఉండదు. కానీ వాళ్ళు మాత్రం ప్రభుత్వం ఇచ్చే నెలవారీ 2 లక్షల గౌరవ వేతనం… కారు, వ్యక్తిగత సిబ్బంది, ప్రోటోకాల్ రాచమర్యాదలతో దర్జాగా తిరుగుతున్నారు. ఈ 50మంది సలహాదారుల్లో 8 మందికి కేబినెట్ ర్యాంక్, 12 మందికి కేటగిరీ -1 కింద పనిచేస్తున్నారు. వీళ్ళకే ఒక్కొక్కరికి నెలకు 3 లక్షల 80 వేల దాకా చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. అధికారిక నివాసం, ప్రభుత్వ కారు, పీఏ, పీఎస్, ఆఫీస్ సిబ్బంది వాళ్ళకి జీతం ఇవన్నీ కలుపుకుంటే… కేబినెట్ ర్యాంక్ అడ్వైజర్ కి దాదాపు 6 లక్షలు, రెండో కేటగిరీ వాళ్ళకి దాదాపు 5 లక్షలు, మూడో కేటగిరీకి 4 లక్షలు ఖర్చవుతున్నాయి. అంతే ఇలా సలహాదారులకే మొత్తం 500 కోట్ల దాకా ఖర్చయ్యాయి. ఇప్పటికైనా జగన్ ప్రజల సొమ్మును అడ్వైజర్లకు ఖర్చుపెట్టకుండా చూడాలని ఏపీ జనం డిమాండ్ చేస్తున్నారు.