YS Jagan : కలలు కనాలి.. కథలు *గొద్దు.. జగన్‌ను ఏసుకుంటున్న నెటిజన్లు..

జగన్ టైమ్ మాములు బ్యాడ్‌గా లేదు. ఏం చేసినా రివర్స్ అవుతోంది. వైనాట్‌ 175 అంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టిన జగన్‌కు.. జనం కోలుకోలేని షాక్ ఇచ్చారు. కేవలం 11సీట్లకు వైసీపీని పరిమితం చేసి.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 27, 2024 | 06:29 PMLast Updated on: Jul 27, 2024 | 6:29 PM

Jagan Time Is Usually Not Bad Whatever Is Done Is Getting Reversed To Jagan Who Blew Up Before The Election By Saying Whynot 175

జగన్ టైమ్ మాములు బ్యాడ్‌గా లేదు. ఏం చేసినా రివర్స్ అవుతోంది. వైనాట్‌ 175 అంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టిన జగన్‌కు.. జనం కోలుకోలేని షాక్ ఇచ్చారు. కేవలం 11సీట్లకు వైసీపీని పరిమితం చేసి.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. జగన్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. మాజీ మంత్రుల మీద కేసులు నమోదు కావడం.. జగన్‌ సర్కార్ హయాంలో అవినీతి అంటూ చంద్రబాబు రోజుకో శ్వేతపత్రం బయటపెట్టడం.. వీటన్నింటికి తోడు చెల్లి కూడా పగ పట్టేయడం.. ఇలా జగన్ టైమ్ మరీ బ్యాడ్‌గా నడుస్తోంది.

చివరికి అబ్దుల్‌ కలాం వర్ధంతిపై పోస్ట్ పెట్టినా.. జగన్‌ పరువు తీసేస్తున్నారు నెటిజన్లు. సోషల్‌ మీడియాలో జగన్ మీద భారీ ట్రోలింగ్ నడుస్తోంది. అబ్దుల్ కలాం పథమ పౌరుడు అంటూ ట్వీట్‌లో జగన్ ప్రస్తావించగా… నువ్ అథమ పౌరుడు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక మరికొందరయితే.. అబ్దుల్ కలాం పేరు ఎత్తే అర్హత లేదంటూ జగన్‌కు కౌంటర్ ఇస్తున్నారు. కలాం ప్రతిభ అవార్డులకు పేరు తొలగించి… వైఎస్ఆర్ పేరు పెట్టుకున్నప్పుడు… ఆయన దేశం గర్వించే శాస్త్రవేత్త అని గుర్తు లేదా అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. విశాఖలో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌ను తీసేసి… వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెట్టినప్పుడు ఈ బుద్ధి ఏమైంది అంటూ వీడియోలు పెట్టిమరీ ప్రశ్నిస్తున్నారు.

అబ్దుల్ కలాం పేరు ఎత్తే అర్హత కూడా లేదు జగన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురుస్తోంది. వైసీపీ హయాంలో ఐదేళ్లు ఆయనను అవమానించినందుకు ముందు క్షమాపణ చెప్పి.. ఆ తర్వాత మాట్లాడాలి అంటూ.. ఇంకొందరు ఘాటు విమర్శలు చేస్తున్నారు. దీంతో జగన్ ట్రోలింగ్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. 2019లో వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కలాం, ఎన్టీఆర్ పేర్లు మార్చింది. ఇదే వైసీపీని భారీగా దెబ్బతీసింది అనే విమర్శలు ఉన్నాయ్.