YS Jagan vs Sharmila : పదేళ్ల తర్వాత బెంగళూరుకు జగన్.. షర్మిలతో రాజీ కోసమేనా.. సీక్రెట్ ఏంటి?
వైసీపీ (YCP) అధినేత జగన్ (YS Jagan) .. బెంగళూరుకు (Bangalore) వెళ్తున్నారు. మూడు రోజులు పులివెందులలో ఉన్న ఆయన.. భార్య భారతి (Bharti) తో కలిసి బెంగళూరు వెళ్లిపోయారు.
వైసీపీ (YCP) అధినేత జగన్ (YS Jagan) .. బెంగళూరుకు (Bangalore) వెళ్తున్నారు. మూడు రోజులు పులివెందులలో ఉన్న ఆయన.. భార్య భారతి (Bharti) తో కలిసి బెంగళూరు వెళ్లిపోయారు. దాదాపు పదేళ్ల తర్వాత జగన్ బెంగళూరుకు వెళ్లడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అసలు ఆట ఇప్పుడు మొదలైంది.. ఎవరూ ఊహించని పరిణామాలు చూస్తారు అంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టేశారు. దీంతో అసలు పదేళ్ల తర్వాత బెంగళూరు వెళ్లే పని జగన్‌కు ఏం పడింది. ఏపీ రాజకీయాల్లో కొద్దిరోజులు కనిపించరా.. లేదంటే అద్భుతం ఏదో రెడీ చేస్తున్నారా.. ఇలా రకరకాల చర్చ జరుగుతోంది ఏపీ పాలిటిక్స్‌లో.. రాజకీయాల్లోకి రావడానికి ముందు.. బెంగళూరు వేదికగానే జగన్ వ్యాపారాలు చేసేవారు. 25 నుంచి 30 ఎకరాల్లో ఎయిర్‌పోర్టుకు దగ్గరలో ప్యాలెస్ కట్టుకున్నారు.
ఇక్కడి నుంచే వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన జగన్.. రాజకీయాల్లోకి వచ్చాక అవన్నీ సతీమణి భారతి అండ్ కో చూసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో రాజకీయాలు మాత్రమే చేసిన జగన్.. పదేళ్లుగా బెంగళూరు వైపు కూడా చూడలేదు. సీఎంగా ఉన్నప్పుడు ఎయిర్ పోర్టు వరకు మాత్రమే వెళ్లిన జగన్.. కూతుళ్లను విమానం ఎక్కించి సెండాఫ్ చెప్పి వెనక్కి వచ్చేశారు. అలాంటిది ఇప్పుడు సడెన్‌గా బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు.. అదీ భార్యతో కలిసి ఎందుకు వెళ్తున్నారు.. వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నట్లు నిజంగా బ్రహ్మాండం బద్దలుకాబోతుందా.. అసలేం జరగబోతుంది అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఐతే మరో చర్చ కూడా తెరమీదకు వస్తోంది. షర్మిల కోసమే జగన్.. బెంగళూరు వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న షర్మిల.. ఈ ఎన్నికల్లో వైసీపీని, జగన్‌కు కోలుకోలేని దెబ్బ తీసింది. కాంగ్రెస్ ఒక్క సీటు గెలవకపోయినా.. షర్మిల పెట్టుకున్న కన్నీళ్లు ఓటర్ల మనసులను కదిలించాయ్. కంచుకోట అనుకున్న రాయలసీమలోనూ వైసీపీకి గట్టి షాక్ తగిలింది.
దీంతో షర్మిలతో రాజీకి వచ్చేందుకే జగన్ ఫ్యామిలీతో కలిసి బెంగళూరు వెళ్తున్నారని కొందరు సోషల్‌మీడియాలో కొత్త ప్రచారం మొదలుపెట్టారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. వైఎస్ ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు. ఆయనే అన్నాచెల్లెళ్లను కలిపేందుకు రెడీ అయ్యారనే టాక్ నడుస్తోంది. షర్మిల ఆస్తుల పంపకాలన్నీ డీకే సమక్షంలో జరుగుతాయని.. ఇవన్నీ అయ్యాక అన్నతో చేతులు కలపడానికి చెల్లి సిద్ధంగా ఉందని కూడా పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. మరి ఇది నిజమా.. ఇదే నిజం అవుతుందా అంటే.. ఇదంతా ప్రస్తుతానికి ప్రచారం మాత్రమే. ఏం జరగబోతుందన్నది బెంగళూరులో జగన్ నిర్ణయాలతో అర్థం అవుతుందన్న మాత్రం క్లియర్.