ఇంత ఫ్రస్ట్రేషన్ ఏంటి జగన్‌ ?

జగన్‌లో ఫ్రస్ట్రేషన్‌ పీక్స్‌కు చేరిందంటూ సెటైర్లు వేస్తున్నారు చాలామంది. మే 13న రాష్ట్రంలో ఎన్నికలు ఫలితాలు వచ్చాయని.. అప్పటి నుంచి కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందని జగన్ ప్రశ్నించారు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 4, 2024 | 10:13 PMLast Updated on: Sep 04, 2024 | 10:13 PM

Jagan Visits Flood Affected Areas In Vijayawada

జగన్‌లో ఫ్రస్ట్రేషన్‌ పీక్స్‌కు చేరిందంటూ సెటైర్లు వేస్తున్నారు చాలామంది. మే 13న రాష్ట్రంలో ఎన్నికలు ఫలితాలు వచ్చాయని.. అప్పటి నుంచి కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందని జగన్ ప్రశ్నించారు.. మే 13న ఫలితాలు వస్తే.. మరి ఎన్నికలు ఎప్పుడు జరిగాయ్ జగన్ అంటూ నెటిజన్లు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఫ్రస్ట్రేషన్‌లో ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇది వదిలేస్తే.. విజయవాడలో వరద బాధితులను పరామర్శించందుకు జగన్ రెండుసార్లు వెళ్లారు. అక్కడి జనాలన కాసేపు ఓదార్చారు.. ఎప్పటిలానే కొన్ని రాజకీయ కామెంట్లు చేశారు. ఐతే బుడమేరు మీద గేట్లు తెరిచారని ఒకసారి.. బుడమేరు నది అని మరోసారి చంద్రబాబు సర్కార్‌ మీద విమర్శలు గుప్పించారు జగన్. అసలు బుడమేరు వాగు నది ఎప్పుడు అయింది.. ఆ వాగు మీద గేట్లు ఎప్పుడు పెట్టారు.. వాటిని ఎప్పుడు ఎత్తారు.. ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా జగన్ అంటూ ఘాటుగా రిప్లయ్ ఇస్తున్నారు. విజయవాడ వరదలకు కారణం చంద్రబాబే అన్నావ్‌.. రాజకీయ విమర్శల్లో భాగంగా అన్నావ్‌ కదా బాగానే ఉంది అనుకున్నారు.. కానీ బుడుమేరు నదిని చేశావ్‌.. గేట్లు పెట్టావ్.. వాటిని ఎత్తారంటూ విమర్శలు చేశావ్.. ఇది ఫ్రస్ట్రేషన్‌ కాకపోతే ఏంటి జగన్ అంటూ.. సూటిగా ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఎన్నికల్లో ఓటమిని జగన్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని.. అందుకే ఇలాంటి అర్థంలేని కామెంట్లు చేస్తున్నారంటూ టీడీపీ మీడియా, సోషల్‌ మీడియా ఓ ఆట ఆడుకుంటోంది. ఇప్పుడే కాదు పాత వీడియోలను బయటకు తీస్తోంది. ఆ మధ్య పల్నాడులో వైసీపీ కార్యకర్త ఘటన తర్వాత అక్కడికి వెళ్లిన జగన్.. ఎవరో రిపోర్టర్ ప్రశ్న అడుగుతుంటే.. డిస్టర్బ్ చేయకు మర్చిపోతా అంటూ కామెంట్‌ చేశారు. ఇలా అన్ని వీడియోలను వైరల్ చేస్తూ.. జగన్‌కు ఫ్రస్ట్రేషన్‌కు పీక్స్‌కు చేరిందంటూ పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. కేవలం 11 స్థానాల్లో మాత్రమే ఫ్యాన్‌ పార్టీ విజయం సాధించింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. దీనికితోడు వైసీపీ నుంచి ఒక్కొక్కరుగా జంప్ అవుతున్నారు. నమ్మినబంటు అని పేరు ఉన్న మోపిదేవి కూడా జగన్‌కు హ్యాండ్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్‌కు ఫ్రస్ట్రేషన్ పెరిగిందని.. అందుకే అర్థం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారంటూ.. టీడీపీ దారుణంగా ట్రోలింగ్ చేస్తోంది.