JAGAN ON YV : వైవీని బండబూతులు తిట్టిన జగన్.. రాజధానిపై ఎవడు మాట్లాడమన్నాడు?
ఏపీకి మూడు రాజధానులు కాన్సెప్ట్ తో అభాసుపాలైన జగన్ సర్కార్ కి వై వి సుబ్బారెడ్డి కొత్త తలనొప్పి తెచ్చారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును మరికొన్నేళ్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు నాలుగు రాజధానులు అన్నమాట. ఈ మాట ఒక్కసారిగా వైసిపి వర్గాల్లో బాంబు పేల్చింది. సాధారణ జనం పగలబడి నవ్వుకుంటున్నారు. ఇక టీడీపీ (TDP) వర్గాల్లో, ఎల్లో మీడియాలో అయితే సంబరాలే సంబరాలు.
మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు… ఎన్నికలను ఎలా ఫేస్ చేయాలో అర్థంకాక ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతమతం అవుతుంటే… వైసీపీ (YCP) కీలక నేత, జగన్ బాబాయ్ వై వి సుబ్బారెడ్డి (YV Subbar Reddy) అతి వాగుడుతో ఆ పార్టీకి కొత్త సమస్య ఎదురైంది. రోజురోజుకీ వైసీపీ గ్రాఫ్ పడిపోతోంది. చేజేతులా అధికారాన్ని కోల్పోవలసి వస్తుందేమో అనే భయం వైసీపీని వెంటాడుతోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో వైసీపీ అగ్రనేతలు చేస్తున్న పిచ్చి పనులు, పిచ్చ చేష్టలు ఏపీ సీఎం జగన్ కి అరికాలి మంట నెత్తికెక్కిస్తున్నాయి.
ఏపీకి మూడు రాజధానులు కాన్సెప్ట్ తో అభాసుపాలైన జగన్ సర్కార్ కి వై వి సుబ్బారెడ్డి కొత్త తలనొప్పి తెచ్చారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును మరికొన్నేళ్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు నాలుగు రాజధానులు అన్నమాట. ఈ మాట ఒక్కసారిగా వైసిపి వర్గాల్లో బాంబు పేల్చింది. సాధారణ జనం పగలబడి నవ్వుకుంటున్నారు. ఇక టీడీపీ (TDP) వర్గాల్లో, ఎల్లో మీడియాలో అయితే సంబరాలే సంబరాలు. మళ్లీ దొరికేశాడు… అనుకుంటూ టీడీపీ సోషల్ మీడియా వైసీపీని ఆడుకోవడం మొదలెట్టింది. ఒక రాజధానికే దిక్కు లేదు, అమరావతినీ నాశనం చేశారు. మూడు రాజధానులు పేరుతో ఎటూ తేల్చకుండా కంపుచేసారు. చివరికి రాజధాని లేకుండా చేశారు. ఇంత దుర్మార్గం చేసి… ఎలక్షన్ కి వెళ్లే ముందు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదుని మరికొన్నేళ్లు పొడిగించాలని స్టేట్మెంట్ ఇచ్చి వై వి సుబ్బారెడ్డి కొత్త సంక్షోభానికి తెర తీశారు. జగన్ చుట్టూ ఎంత పనికిమాలిన నేతలు ఉన్నారో, బాధ్యత లేని లీడర్లు ఉన్నారో … సుబ్బారెడ్డి మాటలే చెప్తున్నాయి.
విభజన చట్టంలో నిబంధన ప్రకారం హైదరాబాద్ పదేళ్లు తెలుగు రాష్ట్రాలు రెండింటికి ఉమ్మడి రాజధానిగా ఉంది. మరో రెండు నెలలతో ఆ గడువు ముగిసిపోతుంది. అయితే హైదరాబాదును ఐదేళ్ల క్రితమే పూర్తిగా వదిలేసింది ఏపీ ప్రభుత్వం. అన్ని కార్యకలాపాలు అమరావతి నుంచే జరుగుతున్నాయి. ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదుని పొడిగించినా… ఒరిగేదేం లేదు. పదేళ్లల్లో ఒక రాజధాని నిర్మించుకోలేని చేతకాని ప్రభుత్వాలు… మళ్లీ ఉమ్మడి రాజధాని పొడిగించాలని కోరడం… పైగా ఎంపీ స్థాయి నేత ఆ డిమాండ్ చేయడం అవివేకం. సుబ్బారెడ్డి ఓవరాక్షన్ వైసీపీలో కలకలం సృష్టించింది.
ఈ వ్యవహారం మొత్తం జగన్ దృష్టికి వెళ్ళింది. సుబ్బారెడ్డికి రాజ్యసభ సీట్ వచ్చిందన్న ఆనందం కూడా మిగలకుండా ఆయన్ని తిట్లతో చెడుగుడు ఆడుకున్నాడు జగన్. అసలు నిన్ను ఎవడు రాజధానిపై మాట్లాడమన్నాడు? మీ అతి మాటల వల్లే పార్టీ ఈరోజు దుస్థితిలో ఉంది. మూడు రాజధానుల వ్యవహారం ఇప్పటికే మనకు చాలా అప్రతిష్ట తెచ్చింది. ఇప్పుడు నాలుగో రాజధాని గురించి మాట్లాడడం అవసరమా? నీ మాటల విని జనం నవ్వుకోరా… మీరంతా నోరు మూసుకొని ఉండలేరా… అని సుబ్బారెడ్డిని సీఎం జగన్ చడా మడా తిట్టారట. ఈ నోటి తీట సంక్షోభాన్ని అడ్డుకునేందుకు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. ఎప్పటిలాగే తప్పు మీడియా మీద తోసేశారు.
సుబ్బారెడ్డి మాటలను మీరు వక్రీకరించారు అంటూ తనదైన తత్తర స్టైల్లో విలేకరులపై విరుచుకుపడ్డారు. అసలు బుర్ర ఉన్న వాడెవడైనా హైదరాబాద్ (Hyderabad) ఉమ్మడి రాజధాని గురించి ఇప్పుడు మాట్లాడతాడా? అంటూ ఎదురు ప్రశ్నించారు. అంటే పరోక్షంగా వై వి సుబ్బారెడ్డికి బుర్ర లేదని చెప్పకనే చెప్పారు. సుబ్బారెడ్డి వల్ల జరిగిన డ్యామేజ్ ను బొత్స అడ్డుకోవాలని ప్రయత్నించినా జరగాల్సింది జరిగిపోయింది. వైసీపీ వాళ్లు ఏదో కొత్త పెంట మళ్లీ పెడుతున్నారని జనానికి అనుమానం వచ్చేసింది. మూడు రాజధానుల గొడవలతో విసిగిపోయిన జనం వై వి సుబ్బారెడ్డి కామెంట్ తో ఇప్పుడు వైసీపీని మరింత చీదరించుకుంటున్నారు. ఏదో ఒక వివాదాన్ని రేపితే గాని వీళ్ళకి పొద్దు గడవదా అని తిట్టుకుంటున్నారు.