AP elections CM Jagan : జగన్ చేసిన నాలుగో తప్పు… లిక్కర్ పేరుతో జనాల నిలువుదోపిడీ
జగన్ చేసిన మరో భారీ తప్పిదం... ఏపీలో మద్యం అమ్మకాలను మొత్తం తన కంట్రోల్‌లో పెట్టుకోవడం. మద్యం అమ్మకం ద్వారా తనకు, పార్టీ నాయకులకు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని ప్లాన్ వేశారు జగన్.

Jagan's fourth mistake... vertical robbery of people in the name of liquor
జగన్ చేసిన మరో భారీ తప్పిదం… ఏపీలో మద్యం అమ్మకాలను మొత్తం తన కంట్రోల్‌లో పెట్టుకోవడం. మద్యం అమ్మకం ద్వారా తనకు, పార్టీ నాయకులకు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని ప్లాన్ వేశారు జగన్. దేశంలో దొరికే బ్రాండ్లు అన్నిటిని రాష్ట్రంలోకి అడుగుపెట్టనివ్వకుండా సొంత బ్రాండ్లు క్రియేట్ చేశారు. ఇది జగన్ విశృంకలతకు మచ్చుతునక. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్… ఇలాంటి పిచ్చి పేర్లతో లిక్కర్ బ్రాండ్లను సృష్టించి.. ఏపీకే పరిమితం చేసి.. అధిక రేట్లకి లిక్కర్ అమ్ముకున్నారు. అది తాగితే అనారోగ్యం.. మరోవైపు రేట్ ఎక్కువ. కేవలం సొంత లిక్కర్ పాలసీ అమ్మకాల వల్ల… జగన్ ఆయన చుట్టూ ఉన్న కొందరు మాత్రమే వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయ్.
భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ… ఇలా లిక్కర్ బ్రాండ్లు పెట్టి ప్రభుత్వం అమ్ముకున్న పరిస్థితి లేదు. జగన్‌కు డబ్బు ఎలా సంపాదించాలో తెలుసు. ఎక్కడి నుంచి సంపాదించాలో కూడా తెలుసు. మద్యం మీద కబ్జా పెట్టి సొంత బ్రాండ్ల సృష్టించి లాభపడ్డాడు. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తానని ఇచ్చిన హామీని కూడా గాలికి వదిలేశాడు. లిక్కర్ రాష్ట్రంలో చాలామందిని ప్రభావితం చేస్తుంది. ఒకపక్క డబ్బులు ఇస్తున్నాడు.. మరోపక్క ఇలా జనాలను దోచేశాడు అనే టాక్ పబ్లిక్‌కు భారీగా వెళ్లిపోయింది.