YS Jagan,Chandrababu : జగన్ ఇల్లు కూల్చేసిన రేవంత్ సర్కార్.. చంద్రబాబు ప్రభావమేనా ?
ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకొని నిరాశలో ఉన్న ఏపీ మాజీ సీఎం జగన్‌కు.. ఊహించని షాక్ తగిలింది. జగన్‌కు రేవంత్ సర్కార్ అదిరిపోయే షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లోటస్‍పాండ్‍లోని జగన్ ఇంటి ముందు రోడ్డును ఆక్రమించి నిర్మించిన సెక్యూరిటీ పోస్టులను.. గ్రేటర్ అధికారులు కూల్చేశారు.
ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకొని నిరాశలో ఉన్న ఏపీ మాజీ సీఎం జగన్‌కు.. ఊహించని షాక్ తగిలింది. జగన్‌కు రేవంత్ సర్కార్ అదిరిపోయే షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లోటస్‍పాండ్‍లోని జగన్ ఇంటి ముందు రోడ్డును ఆక్రమించి నిర్మించిన సెక్యూరిటీ పోస్టులను.. గ్రేటర్ అధికారులు కూల్చేశారు. రోడ్డును ఆక్రమించి ప్రత్యేక గదులు నిర్మించారని గుర్తించిన అధికారులు.. వాటిని జేసీబీలతో కూల్చేశారు. వాహనదారుల నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చాయని.. అందుకే చర్యలు తీసుకున్నామని అధికారులు చెప్తున్నారు.
ఐతే దీన్ని అడ్డుకునేందుకు వైసీపీ వర్గం ప్రయత్నించగా.. వారిని తోసేసిందని తెలుస్తోంది. గ్రేటర్ అధికారుల చర్యలు ఎలా ఉన్నా.. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. చంద్రబాబు ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న రెండు రోజుల్లోనే జగన్ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చేయడంపై.. రేవంత్ మీద వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో భగ్గుమంటున్నారు. కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు రాలేదని.. అక్కడ చంద్రబాబు సీఎంగా పగ్గాలు అందుకోవడంతో.. రేవంత్ సర్కార్ ఇలాంటి చర్యలు పాల్పడడం రకరకాల అనుమానాలకు తావిస్తోందని ఆరోపిస్తున్నారు. జగన్ మీద కక్షసాధింపులో భాగంగా రేవంత్‌ను అడ్డుపెట్టుకొని చంద్రబాబు ఇలాంటి చీఫ్ గేమ్స్ ఆడుతున్నారని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.
ఐతే గతంలో టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయ్. చంద్రబాబును, టీడీపీని.. జగన్ పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావని.. అధికారంలోకి రాగానే జగన్, వైసీపీకి బుద్ది చెప్తామని.. గతంలో బహిరంగంగానే కామెంట్లు చేశారు. ఐతే పక్క రాష్ట్రం తెలంగాణ పారిపోయినా వదిలేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు లోటస్‌పాండ్ దగ్గర నిర్మాణాలు కూల్చేయడం… చంద్రబాబు ఎఫెక్టేనా అనే చర్చ జరుగుతోంది. మరి ఈ రచ్చ ఇంకా ఎలాంటి వివాదాలకు దారి తీస్తుంది.. ఏ మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.