STONE NOT WORKOUT : ఫలించని జగన్ గాయం డ్రామా.. జనంలో సానుభూతి నిల్

బెజవాడ (Bejawada) సింగ్ నగర్ లో జగన్(CM Jagan) పై జరిగిన రాయి దాడి వైసీపీ (YCP) కి ఆశించిన మేలు చేయలేదు. జనంలో పెద్దగా సానుభూతి కూడా రాలేదు. ధర్నాలు, ఆందోళనలు అనుకున్నంతగా ఫలించలేదు. ఆత్మహత్యలు, ఆత్మహత్యా ప్రయత్నాలు ఇవి కూడా ఏమీ జరగలేదు. దీంతో వైసిపి నేతలకు ఎక్కడో తేడా కొడుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 16, 2024 | 09:41 AMLast Updated on: Apr 16, 2024 | 9:41 AM

Jagans Injury Drama Is Fruitless Nil Sympathy Among The People

 

 

బెజవాడ (Bejawada) సింగ్ నగర్ లో జగన్(CM Jagan) పై జరిగిన రాయి దాడి వైసీపీ (YCP) కి ఆశించిన మేలు చేయలేదు. జనంలో పెద్దగా సానుభూతి కూడా రాలేదు. ధర్నాలు, ఆందోళనలు అనుకున్నంతగా ఫలించలేదు. ఆత్మహత్యలు, ఆత్మహత్యా ప్రయత్నాలు ఇవి కూడా ఏమీ జరగలేదు. దీంతో వైసిపి నేతలకు ఎక్కడో తేడా కొడుతోంది. సానుభూతి లేదు. సరే ఎంతోకొంత చర్చ అయితే జరిగింది కదా… పార్టీల… జనంలో… అటెన్షన్ అయితే జనరేట్ అయింది కదా అని సర్దుకుపోతున్నారు వైసీపీ లీడర్లు.

జగన్ పై రాయి పడగానే జనం అందరికీ వచ్చిన మొట్ట మొదటి డౌట్. ఇది కూడా కోడి కత్తి డ్రామా లాంటిదే అని. ఎలక్షన్ ప్రచారాన్ని భీకరంగా నడిపించడంలో, జనం సానుభూతిని కూడగట్టుకోవడంలో ఐప్యాక్ లాంటి సంస్థలు ఆరితేరాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తుంటాయి. ఆంధ్రాలో కులాల్ని, భావోద్వేగాలని రెచ్చగొట్టడం ఐ ప్యాక్ వ్యూహంలో భాగమని చాలామంది జనం ఇప్పటికే గ్రహించేశారు. 2019లో జరిగిన కోడికత్తి డ్రామా ఈరోజుకి తేలలేదు. ఆ రోజు కోడి కత్తి శ్రీను జగన్ పై ఎందుకు ఎటాక్ చేశాడో… ఇప్పటికీ అర్థం కాదు.

2019 ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్య, కోడి కత్తి డ్రామా ఈ రెండు జగన్ కి బాగా కలిసి వచ్చాయి. అప్పట్లో కింది స్థాయి జనం సానుభూతిని ఈ రెండు సంఘటనలు కూడగట్టగలిగాయి. అయితే ఐదేళ్లయినా కూడా వాటి వెనకున్న నిందితులు ఎవరన్నది ఇప్పటికీ తేలకపోవడంతో జనం కచ్చితంగా ఆ రెండు సంఘటనలను వైసీపీ వాళ్ళ వ్యూహంలో భాగమేనని అంచనాకొచ్చేసారు. దాంతో ఇప్పుడు జగన్ పై రాయి దాడి నిజంగా జరిగినప్పటికీ దాన్ని నమ్మే పరిస్థితి లేదు. అంతేకాదు ఒకే రాయి ఇద్దరికీ ఎలా తగులుతుంది? జగన్ కి గాయం చేసిన ఆ రాయి వెల్లంపల్లి కంటికి కూడా బలంగా తగిలింది అంటే… సాధ్యమేనా అనే సందేహం ఇప్పటికీ అందర్నీ వేధిస్తోంది. ఆ… ఈ వైసీపీ పార్టీ వాళ్లు ఎన్నికల ముందు జనం సానుభూతి కోసం ఏదో ఒకటి ఇలాంటివి చేస్తూ ఉంటారు అని ఓపెన్ గానే మాట్లాడుకున్నారు జనం. వైసిపి నాయకులు కూడా ఆఫ్ ద రికార్డ్ మా ఐప్యాక్ వాళ్లు, మా పెద్ద నాయకులో, ఎవరో ప్లాన్ చేసి ఉంటారు అని గుసగుసలాడుకున్నారు.

దీంతో మొదటి రోజే రాయి రాజకీయం తేలిపోయింది. అప్పటికి చాలా చోట్ల ధర్నాలు, ఆందోళనలు జరిగినా …వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికల ప్రచారం టెన్షన్ లో ఉన్న స్థానిక వైసీపీ నేతలంతా ఏదో తూతూ మంత్రంగా ఆందోళన చేశారు. టిడిపి, జనసేన పార్టీలు ఎదురుదాడి బాగానే చేశాయ్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జగన్ పై రాయి దాడి మీద సానుభూతిగా ఒక్క ట్వీట్ చేయకపోగా… అసలు ఇదంతా జగన్ డ్రామా అన్న రీతిలో మాట్లాడారు. అంతేకాదు జగన్ కి గాయం అయితే రాష్ట్రానికి గాయం ఎలా అవుతుంది? 15 ఏళ్ల కుర్రాడిని పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు ఆనాడు వైసిపి వాళ్లంతా ఎందుకు ఆందోళన చేయలేదు? అప్పుడు వీళ్లంతా ఎక్కడున్నారు అని ప్రశ్నించారు? అంతేకాదు జగనే కావాలనే గాయం చేసుకుని ఉంటాడు అని పవన్ తెగించి కామెంట్ చేయడం టిడిపి వాళ్ళని కూడా ఆశ్చర్యపరిచింది.

జనసేన సోషల్ మీడియా పుష్పా మూవీలో అల్లు అర్జున్ మేకప్ వీడియోని రిలీజ్ చేస్తూ ఇలా కూడా గాయం చేసుకోవచ్చు అని సెటారిక్ గా కామెంట్ చేసింది. ఇవన్నీ కలిసి రాయి రాజకీయంలో వైసిపికి పెద్దగా సానుభూతి రాకుండా చేసింది. దీనికి తోడు రెండు కుట్లు పడిన జగన్ గాయానికి వైసీపీ లీడర్లు హత్య ప్రయత్నంగా కామెంట్ చేయడం జనానికి నవ్వు తెప్పించింది. సినిమాల్లో ఇలాంటివి ఎన్ని చూడ్డం లేదు అని ఎవరికి వాళ్లే మాట్లాడుకున్నారు. జగన్ పై రాయి దాడి జరిగిన మరుసటి రోజే పవన్ కళ్యాణ్ పైనా….చంద్రబాబుపై కూడా రాళ్లు పడ్డాయి. దీంతో ఎన్నికల ప్రచారంలో రాళ్లు పడటం మామూలే అని అనుకున్నారు జనం. వీటన్నిటికీ తోడు గతంలో చంద్రబాబుపై రాళ్లు పడినప్పుడు, పవన్ కళ్యాణ్ పై చెప్పులు పడినప్పుడు వైసీపీ నేతలే ఆ …పడితే పడతాయి, వేస్తే వేస్తారు అని కామెంట్ చేశారు.

ఇప్పుడు ఆ వీడియోలన్నీ మళ్లీ వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో అన్ని పార్టీలు ఆరితేరిపోయాయి. ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి పార్టీల సోషల్ మీడియా వారియర్స్ వీలైనంత కృషి చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా అదే జరిగింది జగన్ పై రాయి దాడి జరిగితే అది డ్రామా అని చెప్పడానికి టిడిపి, జనసేన సోషల్ మీడియాలు గ్రూపులు బలంగా పని చేశాయి. బెజవాడ గవర్నమెంట్ హాస్పిటల్ లో గాయానికి కుట్లు వేసుకుని డాక్టర్లు, నర్సులతో కలిసి నవ్వుతూ జగన్ దిగిన ఫోటోని టిడిపి, జనసేన సోషల్ మీడియా వర్గాలు జనంలోకి తీసుకెళ్లాయి. అంతేకాక వివేకానంద రెడ్డి హత్య, కోడి కత్తి ఎటాక్ ఈ రెండు సంఘటనలు జగన్ బ్యాచ్ చేసి 2019లో సానుభూతి పిండుకుందనీ… అందుకే ఆ రెండు కేసులు ఎప్పటికీ తేలలేదని జనం గుర్తించారు. దీంతో జగన్ పై రాయి దాడి సంఘటనని పబ్లిక్ చాలా తేలిగ్గా తీసుకున్నారు.

ఇది కూడా వాళ్లే చేయించుకుని ఉంటారులే అని కొట్టి పడేసారు. అంతేకాదు వైసీపీ అనుకూల మీడియా కూడా ఒక రోజుకి మించి రాయి దాడి టెంపోనీ కొనసాగించలేకపోయింది. అధికారంలో ఉన్న పార్టీ, ముఖ్యమంత్రి ప్రచారం చేసుకుంటుంటే శాంతిభద్రల వ్యవహారం, సెక్యూరిటీ ఇదంతా ప్రభుత్వం, పోలీసులు చూసుకోవాల్సిన పని. రాయి దాడి పోలీసు నిర్లక్ష్యం వల్ల జరిగింది తప్ప… రాజకీయ కుట్ర కాదని ప్రతిపక్షాలు ఎస్టాబ్లిష్ చేయగలిగాయి. పోలీసులు కూడా అగంతుకులు రాయి విసిరారని చెప్పారు తప్ప ఇప్పటివరకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎటువైపు నుంచి వచ్చింది, ఎవరు చేశారు అన్నది తేల్చలేకపోయారు. మొత్తం మీద రక రకాల కారణాలతో రాయి రాజకీయం వైసీపీకి పెద్దగానుభూతి ఇవ్వలేకపోయింది.