Jail to Bandla Ganesh : బండ్ల గణేష్ కు ఏడాది జైలు… చెల్లని చెక్కుల కేసులో శిక్ష
సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఒంగోలు AMM కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. చెల్లని చెక్కుల కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. శిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. నాలుగేళ్ళ క్రితం 95 లక్షల రూపాయల అప్పు తీసుకొని తిరిగి చెల్లించకపోగా.... చెక్కులు బౌన్స్ అవడంతో బండ్ల గణేష్ కు ఈ శిక్ష పడింది.
సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఒంగోలు AMM కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. చెల్లని చెక్కుల కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. శిక్షతో పాటు 10 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. నాలుగేళ్ళ క్రితం 95 లక్షల రూపాయల అప్పు తీసుకొని తిరిగి చెల్లించకపోగా…. చెక్కులు బౌన్స్ అవడంతో బండ్ల గణేష్ కు ఈ శిక్ష పడింది.
పరమేశ్వర ఫౌల్ట్రీ ఫాం కోసం 2019లో ఏపీ ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం ముప్పాళ్ళకు చెందిన జెట్టి వెంకటేశ్వర్లు దగ్గర నిర్మాత బండ్ల గణేష్ 95 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. వాళ్ళకి చెక్కులు రాసిచ్చాడు. నాలుగేళ్ళయినా తిరిగి చెల్లించకపోవడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. కేసుకు సంబందించి అనేక వాయిదాల తర్వాత కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా… పది వేల రూపాయల జరిమానా కట్టాలని ఆదేశించింది. నెల రోజుల లోపు బాధితుడికి 95 లక్షలను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఒంగోలు AMM కోర్టుకు నిర్మాత బండ్ల గణేష్ కూడా హాజరయ్యాడు. ఈ తీర్పు మీద పైకోర్టులో సవాల్ చేస్తామంటున్నారు గణేష్ తరఫున లాయర్లు.
గతంలోనూ 2017లో నిర్మాత బండ్ల గణేష్ కు మరో చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు 6 నెలల జైలుశిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ రాసిన వంశీ వేసిన కేసులో ఈ శిక్ష పడింది. జైలు శిక్షతో పాటు 15 లక్షలకు పైగా జరిమానా కూడా కోర్టు విధించింది. గణేష్ బెయిల్ కోసం అప్లయ్ చేయడంతో అప్పట్లో షరతులతో కూడా బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. ఒంగోలు కోర్టులో తీర్పు చెప్పే టైమ్ లో బండ్ల గణేష్ కూడా కోర్టులోనే ఉన్నారు. తీర్పు విని షాక్ అయ్యారు.