Janasena symbol: ఏపీలో అన్ని చోట్లా గాజు గ్లాసు గుర్తు.. బీజేపీ, టీడీపీకి ఓట్లు బొక్క పడినట్టే..
గత 2019 ఎన్నికల్లో జనసేన ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసింది. కానీ ఒక్కచోటే గెలిచింది. ఎన్నికల నిబంధనల ప్రకారం తగినన్ని ఓట్లు రాకపోవడంతో.. జనసేన గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ చేర్చింది ఈసీ.
Janasena symbol: ఆంధ్రప్రదేశ్‌లో కూటమిలోని మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు జరిగే అవకాశం కనిపించడం లేదు. గాజు గ్లాసు గుర్తుపై కొనసాగుతున్న కన్‌ఫ్యూజనే ఇందుక్కారణం. జనసేన గుర్తు గాజు గ్లాసు. ఆ పార్టీ పోటీ చేస్తోంది 21స్థానాలే అయినా.. ఏపీలో మిగిలిన అసెంబ్లీ సీట్లల్లోనూ ఈ గుర్తు EVMలలో ఉంటుంది. జనసేన పోటీలోలేని చోట్ల ఆ గుర్తు ఇండిపెండెంట్స్‌కి కేటాయిస్తారు. గాజు గ్లాసు గుర్తును ఈసీ ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడమే ఇందుకు కారణం.
TDP NOMINATIONS: 5 స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు.. బీఫామ్‌లు అందజేసిన చంద్రబాబు
గత 2019 ఎన్నికల్లో జనసేన ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసింది. కానీ ఒక్కచోటే గెలిచింది. ఎన్నికల నిబంధనల ప్రకారం తగినన్ని ఓట్లు రాకపోవడంతో.. జనసేన గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ చేర్చింది ఈసీ. అంటే జనసేన పోటీ చేసే 21 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులకే ఈ గుర్తు ఉంటుంది. వాళ్ళు లేని చోట్ల ఇండిపెండెంట్లకు గాజు గ్లాసును కేటాయిస్తారు. గత తెలంగాణ ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలసి పోటీ చేస్తున్నాయి. అందువల్ల జనసేన పోటీ చేయని ప్రాంతాల్లో గాజు గ్లాసు గుర్తు ఇండిపెండెంట్లకు వెళితే.. ఆ పార్టీపై అభిమానం ఉన్నవాళ్ళు గ్లాసుపైనే ఓట్లు వేసే అవకాశాలున్నాయి. గతంలో తిరుపతిలో జరిగిన ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. కానీ అక్కడ గాజు గ్లాసు గుర్తు వచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థికి.. ఎలాంటి ప్రచారం చేయకుండానే 2500 ఓట్లు వచ్చాయి. అందువల్ల జనసేన పోటీలేని చోట్ల.. టీడీపీ, లేదా బీజేపీ గుర్తులకు మాత్రమే ఓట్లు వేయాలని ఎంతమంది అనుకుంటారు అన్నది డౌటే. గ్లాసు కనిపించగానే ఓటు వేస్తే పరిస్థితి ఏంటని కూటమి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
కొన్ని నియోజకవర్గాల్లో వందల్లోనే ఫలితం మారే ఛాన్సు ఉంటుంది. అలాంటప్పుడు జనసేన లేని చోట్ల గాజు గ్లాసు గుర్తుకు పడిన ఓట్లతో రిజల్ట్స్ తారుమారయ్యే ఛాన్సుంది. ఈమధ్య మరో పార్టీ కూడా ఈ గుర్తు కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. అదృష్టవశాత్తూ జనసేనకు ఫేవర్‌గా కోర్టు తీర్పు వచ్చింది. అయితే ఫ్రీ సింబల్‌గా ఉన్న గాజు గ్లాసు గుర్తును పర్మినెంట్‌గా తమకే కేటాయించాలని జనసేన కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇప్పటికే కోరింది. అక్కడ నుంచి ఇంకా ఎలాంటి రిప్లయ్ రాలేదు. నామినేషన్ల ఉపసంహరణ లోపు ఈసీ నుంచి రిప్లయ్ వస్తే ఓకే. లేకపోతే మాత్రం.. జనసేన సింబల్ గాజు గ్లాసు ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఉండే అవకాశముంది. కూటమి పార్టీల ఓట్లకు బొక్కపడే అవకాశాలూ ఉన్నయ్.