Mudragada Padmanabham : ఈ నెల 14 వైసీపీ లో చేరనున్న కాపు నేత ముద్రగడ పద్మనాభం..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) కు మరెంతో సమయం లేదు.. ప్రధాన పార్టీలన్ని కూడా ప్రచారం మొదలుపెట్టేశాయి. ఎవరికి వారు ఈ పార్టీ నుంచి అటు.. ఆ పార్టీ నుంచి ఇటు వెళ్తున్నారు. తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) కూడా ఇదే దారిలో వెళ్తున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP Assembly Elections) కు మరెంతో సమయం లేదు.. ప్రధాన పార్టీలన్ని కూడా ప్రచారం మొదలుపెట్టేశాయి. ఎవరికి వారు ఈ పార్టీ నుంచి అటు.. ఆ పార్టీ నుంచి ఇటు వెళ్తున్నారు. తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) కూడా ఇదే దారిలో వెళ్తున్నారు. ముద్రగడ పద్మనాభం వైసీపీ పార్టీలో చేరడం ఖాయమైపోయింది. ఇక అధికారికంగా మెడలో పార్టీ కండువా వెసుకోవడమే మిగిలి ఉంది.
ఈ నెల 14న ముద్రగడ తాడేపల్లిలో సీఎం సమక్షంలో వైసీపీ (YCP) కండువా కప్పుకోనున్నారు. ముద్రగడ కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీగా వెళ్లి వైసీపీలోకి జాయినింగ్ ఉంటుందని అనుచరులకు క్లారిటీ ఇచ్చారు. ముద్రగడతో పాటు వైసీపీలో తన కుమారుడు గిరి చేరనున్నారు. 2009లో కాంగ్రెస్ తరపున పిఠాపురం నుంచి చివరిసారి పోటీ చేసి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. భవిష్యత్తులో రాజ్యసభ, ప్రస్తుతానికి ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ముద్రగడ తనయుడికి కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చేలా గురువారం చర్చలు జరిగినట్టు తెలిసింది.