BREAKING: టీడీపీకి విజయవాడ ఎంపీ కేశినేని గుడ్ బై !
టీడీపీ అధినేత చంద్రబాబుతో విభేదాలతో ఆ పార్టీని వీడాలని విజయవాడ ఎంపీ కేశినేని నిర్ణయించారు. త్వరలోనే ఎంపీ పదవికి, టీడీపీకి త్వరలో రాజీనామా చేస్తానని ట్వీట్ చేశారు. తిరువూరులో అన్నదమ్ములు కేశినేని నాని-చిన్ని మధ్య విభేదాలు తీవ్రం కావడంతో చివరకు పార్టీని వీడాలని నాని నిర్ణయించారు.
త్వరలో పార్లమెంట్ సభ్యత్వానికి, టీడీపీకి రాజీనామా చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని ట్వీట్ చేశారు. పార్టీకి తన అవసరం లేదని చంద్రబాబు భావించారు. అందువల్ల ఇంకా పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని నిర్ణయించినట్టు తెలిపారు. త్వరలో ఢిల్లీకి వెళ్ళి లోక్ సభ స్పీకర్ ని కలిసి రిజైన్ చేస్తానన్నా నాని. ఆ మరుక్షణమే టీడీపీకి కూడా రాజీనామా చేస్తానని X లో తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరితో ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు కేశినేని నాని. మూడు రోజుల క్రితం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో అన్నదమ్ములు కేశినేని నాని, చిన్ని మధ్య గొడవ జరిగింది. రెండు వర్గాలు వాగ్వాదం పెట్టుకున్నారు. కుర్చీలు విసురుకున్నారు. చిన్నిని మీటింగ్ జరిగే ఫంక్షన్ హాల్లోకి అనుమతించకుండా కేశినేని నాని వర్గీయులు అడ్డుకున్నారు. ఈ ఇష్యూపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈనెల 7న తిరువూరులో చంద్రబాబు పాల్గొనే సమావేశ ఏర్పాట్లపై కలగజేసుకోవద్దని నానికి చంద్రబాబు సూచించారు. పార్టీ కార్యకలాపాలకు నానిని దూరంగా ఉండాలని కూడా చెప్పారు. అంతేకాకుండా… ఈసారి విజయవాడ ఎంపీ టికెట్ కేశినేని నానికి ఇచ్చేది లేదన్న టీడీపీ స్పష్టం చేసింది. కేశినేని చిన్నికి ఇవ్వాలని నిర్ణయించారు. కొంతకాలంగా కేశినేని నాని-చిన్న మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గతంలో లోకేష్ పైనా విమర్శలు చేశారు కేశినేని నాని. ఈపరిణామాలతో విజయవాడ ఎంపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించారు.