KESINENI NANI: రాంగ్ రూట్.. దారి తప్పిన కేశినేని ట్రావెల్స్
తన అవసరం లేదని చంద్రబాబు భావించారన్న కేశినేని నాని.. ఇంకా పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగానే పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. మరి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత నాని వాట్ నెక్స్ట్ అనే మాట బెజవాడ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నది.
KESINENI NANI: కేశినేని నాని ఫిక్సయ్యారు. టీడీపీకి రాంరాం చెప్పేశారు. స్పీకర్‌ని కలిసి రిజైన్ లెటర్ ఇస్తానన్నారు. మరి కేశినేని ట్రావెల్స్ తర్వాతి రూటు ఎటు? వైసీపీకా? బీజేపీకా? మొత్తానికి కేశినేని నాని ఒక ఉత్కంఠకు తెరదించారు. రాజీనామాపై ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. ఎంపీ పదవికి కూడా రిజైన్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. త్వరలో లోక్‌సభ స్పీకర్‌ను కలిసి లోక్‌సభ సభ్యుడిగా రాజీనామా సమర్పిస్తానన్నారు. తన అవసరం లేదని చంద్రబాబు భావించారన్న కేశినేని నాని.. ఇంకా పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగానే పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. మరి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత నాని వాట్ నెక్స్ట్ అనే మాట బెజవాడ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నది.
REVANTH REDDY: 6 వద్దు 9 ముద్దు.. 6ను నమ్ముకుని కేసీఆర్ మునిగిపోయాడు.. నేను 9లో ఉంటా..
చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఏదైనా పార్టీ నుంచి పోటీ చేస్తారా? లేదంటే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతారా? ఇదే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది పార్టీలో! అయితే, తిరువూరు సభా బాధ్యతలు కేశినేని చిన్నికి అప్పగించడం వెనుక మతలబ్ ఏమై ఉంటుందని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. టికెట్ చిన్నికే ఇస్తారా? అందులో భాగంగానే సభా బాధ్యతలు ఇచ్చారా అనే కోణంలో చర్చించుకుంటున్నారు. చిన్ని మాత్రం ఈ విషయంపై ఆచితూచి మాట్లాడుతున్నారు. నాని రాజీనామా ప్రకటన విషయం తెలియదని లౌక్యంగా చెప్పుకొచ్చారు. తిరువూరు సభలో ఎంపీగా నానికి ఇచ్చే గౌరవం, ప్రొటోకాల్, మర్యాద అన్నీ ఉంటాయన్నారు. బెజవాడ పార్లమెంట్ పరిధిలో అందరం కలిసి కట్టుగానే ఉన్నామన్నారు చిన్ని. ఏ కుటుంబంలో అయినా సమస్యలుంటాయ్.. టీడీపీలోనూ ఉంటాయ్.. అన్నీ సర్దుకుంటాయన్న టైపులో చెప్పుకొచ్చారాయన. రాజీనామా ప్రకటన తర్వాత టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ నానీతో భేటీ అయ్యారు. ఈ పరిణామంపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
పార్టీ సూచన మేరకు ఎంపీ రవీంద్ర వెళ్లారా ? లేదంటే సహచర ఎంపీకి నచ్చ జెప్పడానికి వచ్చారా అన్నది ఉత్కంఠగా మారింది. కేశినేని నానిని కలిసివచ్చాక అన్ని వివరాలు చెబుతానంటూ…కేశినేని భవన్‌కు వెళ్లిన కనకమేడల… తర్వాత ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. నాని పార్టీ వీడి వెళ్తున్నారంటే.. ఒక్కరేం వెళ్లరు. తన అనుచరులను కట్టగట్టుకుని తీసుకెళ్తారు. స్వతంత్రంగా పోటీచేసినా, ఇంకో పార్టీలో చేరినా తనకంటూ కేడర్ క్యారీ కావల్సిందే. మరి రాజీనామాకు ముందే తన అనుచరులతో చర్చిస్తారా? తర్వాత మాట్లాడుతారా అన్నదానిపై ఒకటీ రెండు రోజులు గడిస్తేకానీ క్లారిటీ రాదు!