Konathala Rama Krishna: జనసేనలోకి మరో సీనియర్ లీడర్.. త్వరలోనే పార్టీలో చేరిక..?
సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేన నేతలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కొణతాల రామకృష్ణ.. కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగారు. ఉమ్మడి విశాఖజిల్లాలో బలమైన గవర సామాజిక వర్గం ప్రతినిధిగా చెలామణి అయ్యారు.

Konathala Rama Krishna: ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నేతలు ఎన్నికల వేళ తమకు అనుుకూల పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు సొంత పార్టీల్ని వీడుతున్నారు. ముఖ్యంగా ఏపీలో ఎక్కువ మంది నేతలు వైసీపీని వీడుతుంటే.. టీడీపీ, జనసేనల్లో చేరుతున్నారు. తాజాగా సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేన నేతలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కొణతాల రామకృష్ణ.. కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగారు.
Guntur Kaaram Review: ఇలా చేసావేంటి రమణా..? గురూజీని.. కుర్చీ మడతపెట్టి..!
ఉమ్మడి విశాఖజిల్లాలో బలమైన గవర సామాజిక వర్గం ప్రతినిధిగా చెలామణి అయ్యారు. అనంతరం జగన్ ప్రభావంతో వైసీపీలో చేరారు. 2009లో కాంగ్రెస్ నుంచి, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆయనకు జగన్ అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో రాజకీయంగా కొణతాల హవా తగ్గుతూ వచ్చింది. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే, మరో మూడు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కొణతాల యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే అనకాపల్లిలో తన అనుచరులతో సమావేశమయ్యారు. రాజకీయ భవిష్యత్తుపై చర్చించారు. జనసేన నేతలతో కొణతాల టచ్‌లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌తోనూ సమావేశమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.
త్వరలోనే కొణతాల దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిజానికి గత ఎన్నికల ముందు టీడీపీ ఆహ్వానం మేరకు చంద్రబాబును కలిశారు. అనంతరం టీడీపీలో చేరుతారని అంతా భావించారు. కానీ, ఆ పార్టీలో ఉండే వర్గ పోరువల్ల టీడీపీలో చేరలేకపోయారు. మరి ఈసారైనా జనసేనలో చరి, పోటీ చేస్తారో.. లేదో మరికొద్ది రోజుల్లో తేలనుంది.