Renu Emotional : నన్ను వదిలేయండి ప్లీజ్.. పవన్ ఫ్యాన్స్‌పై రేణూ సీరియస్
ప్రేమ ఐనా అభిమానం ఐనా ఒక హద్దు వరకూ బాగానే ఉంటుంది. హద్దు మీరితేనే కొత్త సమ్యలు వస్తాయి. ఇలా పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి కామెంట్ చేసి రేణూ చేతిలో చీవాట్లు తిన్నాడు ఓ పవన్ ఫ్యాన్.

Leave me please.. Renu is serious about Pawan's fans
ప్రేమ ఐనా అభిమానం ఐనా ఒక హద్దు వరకూ బాగానే ఉంటుంది. హద్దు మీరితేనే కొత్త సమ్యలు వస్తాయి. ఇలా పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి కామెంట్ చేసి రేణూ చేతిలో చీవాట్లు తిన్నాడు ఓ పవన్ ఫ్యాన్. రేణూ దేశాయ్ పవన్ జీవితంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. వాళ్లిద్దరి జీవితాలు అభిమానులకు తెరిచిన పుస్తకం. పేరుకు వాళ్లు విడిపోయినా.. పవన్ ఫ్యాన్స్ అంతా రేణూను తమ వదినగానే భావిస్తారు. అదే గౌరవం ఇస్తారు. రీసెంట్‌గా పవన్ ఏపీ డిప్యుటీ సీఎం అయ్యాక.. అకీరా రెగ్యులర్‌గా కెమెరా ముందకు వస్తూనే ఉన్నాడు.
ఇదే క్రమంలో అకీరాను ఉద్దేశిస్తూ రేణూ ఎమోషనల్ పోస్ట్‌లు పెడుతున్నారు. తన తండ్రి విషయంలో అకీరా చాలా గర్వంగా ఉన్నాడని.. అకీరాను చూస్తే తనకు సంతోషంగా ఉందంటూ రీసెంట్‌గా ఓ పోస్ట్ పెట్టారు. దానికి ఓ పవన్ ఫ్యాన్ పెట్టిన కామెంట్ ఇప్పుడు రేణూకు కోపం తెప్పించింది. మీరు పవన్ కళ్యాన్‌ను వదిలేసినా.. మేము ఇప్పటికీ మిమ్మల్ని వదినగానే స్వీకరిస్తున్నాము.. ఇప్పటికైనా పవన్ విలువ మీకు తెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీర ఎక్కడున్నా మా వదినగా సంతోషంగా ఉండాలి అంటూ ఆ అభిమాని కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్‌కు రేణూ రిప్లై ఇచ్చారు. తాను పవన్‌ను వదిలేయలేదని.. పవనే తనను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పింది. అభిమానం హద్దులు మీరితే బాగుండదని.. పవన్ వ్యక్తిగత విషయాల్లోకి తనను లాగొద్దంటూ చెప్పింది.
తన పిల్లలకు పవన్‌కు మాత్రమే కాదు తనకు కూడా పిల్లలేనని.. పవన్ వ్యక్తిగత విషయాల్లోకి తనను లాగొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది. రేణూ ఇచ్చిన ఈ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రేణూకు మద్దతుగా పవన్ ఫ్యాన్స్ కూడా రిప్లై ఇస్తున్నారు. వాళ్లు లీగల్‌గా విడిపోయిన తరువాత ఒకరి జీవితంలోకి ఒకరిని లాగడం కరెక్ట్ కాదంటూ చెప్తున్నారు. ఏది ఏమైనా అభిమానం ఉంటే వేరేలా చూపించాలి గాని.. ఇలా పర్సనల్ విషయాలు మాట్లాడుతూ మనుషులను బాధపెట్టడం కరెక్ట్ కాదు అంటున్నారు రేణూ ఫ్యాన్స్.