Srisailam Dam, Chandrababu : శ్రీశైలం డ్యామ్ మరో రెండు గేట్లు ఎత్తివేత.. ఎల్లుండి శ్రీశైలం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు..
సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆగస్టు 1న శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam project) ను సందర్శించనున్నారు. జలాశయ పరిశీలనలో.. గంగమ్మకు చీరే సారే సమర్పించి కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్నారు.

Lifting two more gates of Srisailam Dam.. CM Chandrababu for Ellundi Srisailam project..
సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆగస్టు 1న శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam project) ను సందర్శించనున్నారు. జలాశయ పరిశీలనలో.. గంగమ్మకు చీరే సారే సమర్పించి కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్నారు. అదే రోజు ఆయన శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో జరిగే ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. కాగా శ్రీశైలానికి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. దీంతో మూడు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు.
Wayanad Landslides : కేరళలో ప్రకృతి విలయతాండవం.. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 50కి చేరిన మృతుల సంఖ్య!
శ్రీశైలం డ్యామ్ (Srisailam Dam) గేట్లు ఎత్తి దిగువన ఉన్న నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) కు నీటిని విడుదల చేస్తున్నారు. నిన్న సాయంత్రం 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ రోజు మరో రెండు గేట్లను ఎత్తివేశారు. దీంతో శ్రీశైలం జలాశయం (Srisailam reservoir) 5 గేట్ల ద్వారా నీటిని 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం ఇన్ ఫ్లో.. 4,60,040 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో.. 1,41,560 క్యూసెక్కులు. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం.. 880.90 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ.. 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం.. 198.3623 టీఎంసీలకు చేరుకుంది. మరో వైపు కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గేట్లను ఎత్తి దిగువన నాగార్జున సాగర్‌లోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారడంతో పాటు.. గేట్లు ఎత్తడంతో ఆ దృశ్యాన్ని వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.