LOKESH @MANGALAGIRI: మంగళగిరి దాటని లోకేష్ వదిలేస్తే ఓటమి ఖాయమా ?
ఆంధ్రప్రదేశ్ లో ఎండలతో పాటు ఎలక్షన్ హీట్ కూడా అంతకంతకూ పెరుగుతోంది. షెడ్యూల్ వచ్చేలోపే అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు పార్టీల అధినేతలు. ఇప్పటికే జగన్, చంద్రబాబు, పవన్ జనంలో ఉన్నారు. కానీ లోకేష్ జాడ మాత్రం తెలియడం లేదు. ఆయన ప్రస్తుతం మంగళగిరి దాటి బయటకు రావట్లేదు. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఓడిపోవడంతో ఈసారి గెలుపు కోసం అష్టకష్టాలు పడుతున్నారు.

టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ (Nara Lokesh)ను.. గత ఎన్నికల్లో ఓటమి భయం ఇంకా వెంటాడుతున్నట్టు అర్థమవుతోంది. మంగళగిరిని వదిలేస్తే ఈసారి ఓడిపోతానని భయంతో ఉన్నారు. అందుకే ఆయన రాష్ట్ర స్థాయిలో టీడీపీ ప్రచారానికి కూడా వెళ్ళడం లేదు. ఓవైపు చంద్రబాబు ప్రజాగళం చేపట్టి… నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఆ సభలకు లోకేష్ ఎక్కడా హాజరు కావట్లేదు. టీడీపీలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నారు యువనేత నారా లోకేష్. పార్టీలో కీలక నేతగా ఉండి.. ఇతర అభ్యర్థులకు ప్రచారం చెయ్యాల్సిన ఆయన… సొంత నియోజకవర్గానికి పరిమితం అయ్యారు. 20 రోజుల నుంచి మంగళగిరి (Mangalagiri) చుట్టే తిరుగుతున్నారు లోకేష్.
ఎన్నికలకు ముందు పాదయాత్రలు, ప్రజాయాత్రలు అంటూ హడావిడి చేసిన లోకేష్… ఎలక్షన్ హీట్ మొదలయ్యాక ఎందుకిలా ఒకే నియోజకవర్గానికి పరిమతం అయ్యారు. పోనీ అక్కడైనా తన గెలుపు కోసం పనిచేస్తున్నారా అంటే… బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్, డిన్నర్ విత్ లోకేష్ అంటూ చిత్ర విచిత్రమైన ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. పైగా ఈమధ్య కేంద్రం ఇచ్చిన జడ్ ప్లస్ సెక్యూరిటీతో తిరుగుతున్నారు. ఈ హంగూ ఆర్భాటాలను ఆయన చుట్టూ ఉన్న టీడీపీ కోటరీ ఎంజాయ్ చేస్తోంది. కానీ జనం ఆదరించడం లేదని అంటున్నారు. అటు వైసీపీ మహిళా అభ్యర్థి లావణ్య దూసుకుపోతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే మళ్ళీ వైసీపీలోకి వచ్చాక… ఆమె గెలుపు కోసం యాక్టివ్ గా తిరుగుతున్నారు. లోకేష్ ని ఈసారి కూడా అసెంబ్లీకి అడుగుపెట్టనీయబోమని అంటున్నారు వైసీపీ నేతలు.
గతంలో యువగళం (Yuvagalam) యాత్రతో నారా లోకేష్ చేపట్టిన యాత్రతో టీడీపీకి ఏ మాత్రం కలిసిరాలేదని అంటున్నారు. అందుకే ఈసారి చంద్రబాబు ప్రజాగళం చేపట్టారు. లోకేష్ ని బయట నియోజకవర్గాల్లో తిప్పితే పార్టీకి మైనస్సే అన్న టాక్ ఉంది. అందుకే ఆయన్ని రాష్ట్ర స్థాయి ప్రచారానికి దూరం పెట్టేశారు. మరి మంగళగిరిలో అయినా గెలుస్తాడో లేదో తెలియని పరిస్థితి ఉంది.