Mahasena, Rajesh : ఎన్నికల బరి నుంచి మహాసేన రాజేశ్ ఔట్! అసలు ఆయనేం అన్నారు..
ఎన్నికల షెడ్యూల్ కూడా రాలేదు కానీ.. పొలిటికల్ మంటలు పీక్స్‌కు చేరాయ్ ఏపీలో. ఇంచార్జిలను మారుస్తూ జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంటే.. టీడీపీ, జనసేన (TDP-Janasena) ఉమ్మడి జాబితా తర్వాత రెండు పార్టీల్లోనూ అసంతృప్తులు కనిపిస్తున్నాయ్. దీంతో ఏపీ రాజకీయాల్లో రోజుకో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటోంది.
ఎన్నికల షెడ్యూల్ కూడా రాలేదు కానీ.. పొలిటికల్ మంటలు పీక్స్‌కు చేరాయ్ ఏపీలో. ఇంచార్జిలను మారుస్తూ జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంటే.. టీడీపీ, జనసేన (TDP-Janasena) ఉమ్మడి జాబితా తర్వాత రెండు పార్టీల్లోనూ అసంతృప్తులు కనిపిస్తున్నాయ్. దీంతో ఏపీ రాజకీయాల్లో రోజుకో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటోంది. అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించినా కూడా.. ఎన్నికలు వచ్చే వరకు పోటీలో ఎవరు ఉంటారో కూడా తెలియని పరిస్థితులు ఏపీలో కనిపిస్తున్నాయ్. మంగళగిరి (Mangalagiri) ఇంచార్జిని మారుస్తూ జగన్ తీసుకున్న నిర్ణయమే దానికి ఎగ్జాంపుల్. ఇదంతా ఎలా ఉన్నా.. టీడీపీ (TDP) ఫస్ట్ లిస్ట్‌లో.. యూట్యూబర్ మహాసేన రాజేశ్‌కు టికెట్ కేటాయించిన వ్యవహారం రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పి. గన్నవరం నియోజకవర్గం నుంచి చంద్రబాబు.. ఆయనకు టికెట్ ఇచ్చారు. ఐతే రాజేశ్ అభ్యర్థిత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.
ఈ మధ్య జరిగిన టీడీపీ, జనసేన (Janasena) కూటమి సమావేశం రసాభాసంగా మారింది. గతంలో హిందూమతంపై, జనసేన నాయకులపై రాజేశ్ మాట్లాడిన మాటలు.. ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయ్. ఇలాంటి పరిణామాల మధ్య.. పోటీ నుంచి తప్పుకుంటున్నానని మహాసేన రాజేశ్ సంచలన ప్రకటన చేశారంటూ.. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కులరక్కసి చేతిలో మరోసారి బలైపోయాను. జగన్ రెడ్డీ గుర్తుపెట్టుకుంటాను .. పోటీ నుంచి స్వచ్చందంగా తప్పుకుంటాను.. నాకోసం నా పార్టీనీ, చంద్రబాబు గారినీ, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారినీ, లోకేష్ గారినీ ఎవ్వరూ తిట్టొద్దు అంటూ రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ (Mahasena, Rajesh) విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది.
దీంతో ఆయన పోటీ నుంచి వైదొలుగుతున్నారని కొంతమంది ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఐతే ఆ వీడియోలో కావాలంటే వైదొలుగుతాను అన్నారు కానీ.. వైదొలిగాను అని చెప్పలేదు. పైగా చంద్రబాబు ఆదేశిస్తే అనే పదం వాడారు కాబట్టి.. ఇది సహజంగా రాజకీయ నాయకులు వాడే అస్త్రమే… పోటీ నుంచి తప్పుకునే అవకాశమే లేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.