బ్రేకింగ్; మోహన్ బాబుకు లక్ష్మీ షాక్, భూమా మౌనికకు ఫోన్

మంచు కుటుంబంలో ఆస్తులు వ్యవహారం ఇప్పుడు ఏమలుపు తిరుగుతుందో అని అందరు ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఎటువైపు ఉన్నారు అనేదానిపై ముందు నుంచి స్పష్టత లేదు. మంచు విష్ణుతో ఆమె సన్నిహితంగానే ఉంటాఋ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 12, 2024 | 01:04 PMLast Updated on: Dec 12, 2024 | 1:04 PM

Manchu Lakshmi Phone Call To Bhuma Mounika

మంచు కుటుంబంలో ఆస్తులు వ్యవహారం ఇప్పుడు ఏమలుపు తిరుగుతుందో అని అందరు ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఎటువైపు ఉన్నారు అనేదానిపై ముందు నుంచి స్పష్టత లేదు. మంచు విష్ణుతో ఆమె సన్నిహితంగానే ఉంటాఋ. మోహన్ బాబుతో కూడా మంచు లక్ష్మి సన్నిహితంగానే మెలుగుతూ ఉంటారు. ఇక తాను తండ్రి కూతురుని అంటూ చెప్పుకునే ప్రయత్నం పదేపదే చేస్తూ ఉంటారు మంచు లక్ష్మి. ఇక ఇంటిని కూడా తన పేరు మీదనే రాస్తాను అంటూ మోహన్ బాబు కూడా పలుమార్లు ప్రకటించారు.

అయితే ఇప్పుడు మోహన్ బాబుకు మంచు లక్ష్మి షాక్ ఇచ్చారు అనే ప్రచారం మొదలైంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టులను చూస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. రెండు మూడు రోజుల నుంచి మంచు కుటుంబంలో తీవ్రస్థాయిలో వివాదాలు చలరేగుతుంటే ఆమె ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారనే దానిపై స్పష్టత లేదు. కానీ తాజాగా తన కూతురు వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోను మంచు మనోజ్ భార్య భూమా మౌనిక లైక్ కొట్టారు. దీనితో మంచు మనోజ్ కు అలాగే మంచు లక్ష్మి కి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని అంటున్నారు.

మంచు విష్ణు ని లక్ష్మీ కూడా వ్యతిరేకిస్తున్నారు అనే అనుమానాలు కలుగుతున్నాయి. గత కొంతకాలంగా మంచు కుటుంబంలో మంచు విష్ణు పెత్తనం ఎక్కువగా పెరిగిందని, ఈ విషయంలో మంచు మనోజ్ అలాగే మంచు లక్ష్మి ఇద్దరు సీరియస్ గా ఉన్నారని పలు కథనాలు వచ్చాయి. ఇప్పుడు మంచు లక్ష్మి వైఖరి చూస్తుంటే ఇది నిజమే అనే అనుమానం కలుగుతుంది. మంచు విష్ణు విషయంలో గతంలోనే లక్ష్మి ఫిర్యాదులు చేసినా మోహన్ బాబు పట్టించుకోలేదు అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

అయితే మోహన్ బాబు యూనివర్సిటీ విషయంలో మంచు లక్ష్మిని కూడా విష్ణు ఎంటర్ కానివ్వడం లేదని టాక్. యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తుల పంపకాల విషయంలో అది ఇప్పటివరకు కొలిక్కి రాలేదని, ఆ ఆస్తుల్లో లక్ష్మీకి కూడా భాగస్వామ్యం ఉందని మోహన్ బాబు చెప్పడంతో అటు ఆమెకు దక్కనీయకుండా అలాగే మంచు మనోజ్ కూడా జోక్యం చేసుకోకుండా విష్ణు ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే ఇప్పుడు లక్ష్మీ సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా మంచు మనోజ్ తో అలాగే మంచు మనోజ్ బొమ్మ మౌనికతో లక్ష్మికి మంచి సంబంధాలే ఉన్నాయనే విషయం తాజాగా సోషల్ మీడియా పోస్ట్ తో స్పష్టమైంది. భూమా మౌనికతో లక్ష్మీ ఫోన్ లో కూడా మాట్లాడారట.