Andhra Pradesh IAS : ఆంధ్రప్రదేశ్ లో భారీగా IASల బదిలీ..
ఆంధ్రప్రదేశ్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక గత ప్రభుత్వ హయంలో ఉన్నత స్థాయి అధికారులు అందరిని కూడా కొత్త ప్రభుత్వం విధుల నుంచి తప్పస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక గత ప్రభుత్వ హయంలో ఉన్నత స్థాయి అధికారులు అందరిని కూడా కొత్త ప్రభుత్వం విధుల నుంచి తప్పస్తుంది. వారి స్థానల్లో తన ప్రభుత్వం కు కావల్సిన అధికారులను నియమించుకుంటుంది. తాజగా ఏపీలో భారీగా IASలు బదిలీ అయ్యారు. పురపాలకశాఖ, ఎక్సైజ్, పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శులు శ్రీలక్ష్మి, రజత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాశ్‌లను ప్రభుత్వం జీఏడీకి అటాచ్ చేసింది. జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్ కుమార్‌లను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ నూతన ప్రభుత్వ కార్యదర్శులు
- సీఎం కార్యదర్శిగా – ప్రద్యుమ్మ
- సివిల్ సప్లై కమిషనర్‌గా సిద్ధార్థ్ జైన్
- CRDA కమిషనర్‌గా కాటమనేని భాస్కర్
- గనులశాఖ కమిషనర్ గా – ప్రవీణ్ కుమార్
- ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా – సౌరభ్‌గౌర్
- పౌరసరఫరాలశాఖ కమిషనర్ గా – సిద్ధార్థ్ జైన్
- పశు సంవర్ధకశాఖ కార్యదర్శిగా – ఎం.ఎం. నాయక్
- ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ కార్యదర్శిగా – వినయ్ చంద్
- ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ( వ్యయం) కార్యదర్శిగా – జానకి
- వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా – రాజశేఖర్
- పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిగా – శశిభూషణ్ కుమార్
- ఉద్యాన, మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శిగా – అహ్మద్ బాబు
- కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా – గోపాలకృష్ణ ద్వివేదీ
- జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా – జి. సాయి ప్రసాద్
- ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా – కోన శశిధర్( అదనపు బాధ్యతలు)
- నైపుణ్యాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా – సౌరభ్‌గౌర్ (అదనపు బాధ్యతలు)