ANTHA MEGA MAYAM : మెగా ఫ్యామిలీ స్టేజ్ కబ్జా.. టీడీపీ, నందమూరి ఫ్యాన్స్ హర్ట్

ఏపీ మంత్రుల ప్రమాణం స్వీకార కార్యక్రమం చూసిన వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే... ఇది చంద్రబాబు, కేబినెట్ ప్రమాణ కార్యక్రమమా... లేదంటే మెగా స్టార్ సినిమా ఈవెంటా... అని. టీడీపీ లీడర్లు, కార్యకర్తలు, నందమూరి ఫ్యాన్స్ సరిగ్గా ఇలాగే అనుకుంటున్నారట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 13, 2024 | 02:15 PMLast Updated on: Jun 13, 2024 | 2:15 PM

Mega Family Stage Capture Tdp Nandamuri Fans Hurt

 

 

ఏపీ మంత్రుల ప్రమాణం స్వీకార కార్యక్రమం చూసిన వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే… ఇది చంద్రబాబు, కేబినెట్ ప్రమాణ కార్యక్రమమా… లేదంటే మెగా స్టార్ సినిమా ఈవెంటా… అని. టీడీపీ లీడర్లు, కార్యకర్తలు, నందమూరి ఫ్యాన్స్ సరిగ్గా ఇలాగే అనుకుంటున్నారట. జగన్ హయాంలో ఎన్నో కష్టాలు పడి…. జైలుకెళ్లి ఇబ్బందులు పడి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు… ఐదేళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని మళ్ళీ చేపట్టారు. ఆయనతో పాటు మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరిగింది. ఈ ఈవెంట్ కి తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు, నందమూరి ఫ్యాన్స్ భారీగానే హాజరయ్యారు. మొదటిసారి పవన్ కల్యాణ్ అధికారం చేపట్టడంతో మెగాస్టార్, పవర్ స్టార్ అభిమానులు, జనసైనికులు కూడా అటెండ్ అయ్యారు. కానీ ఈ మొత్తం ఈవెంట్ లో హైలెట్ గా నిలిచింది చిరంజీవి, పవన్ కల్యాణ్ మాత్రమే. చిరంజీవి స్టేజ్ పైకి వచ్చినప్పటి నుంచి పవన్ ప్రమాణం చేయడం, మోడీ వాళ్ళిద్దరి చేతులు పట్టుకోవడం దాకా అంతా మెగా ఈవెంట్ లాగా నడిచిపోయిందని తెలుగు తమ్ముళ్ళు బాధపడిపోతున్నారు.

ఏపీ మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణం తర్వాత స్టేజ్ మీద మెగా సందడి మొదలైంది. పవన్ కల్యాణ్ అనే నేను… అనగానే స్టేజ్ ముందు అభిమానుల కేకలతో హోరెత్తించారు. ప్రమాణం తర్వాత పవన్ … మోడీ, బాబు, గవర్నర్ దగ్గరకెళ్ళి అభివాదం చేయడం… చేతులు కలపడం… స్టేజీలో చివరలో కూర్చుకున్న ప్రముఖులను విష్ చేసి రావడం వరకూ మెగా హంగామా నడిచింది. చిరంజీవి కాళ్ళకు పవన్ కల్యాణ్ స్టేజ్ మీదే దండం పెట్టారు. లైవ్ టెలికాస్ట్ ఇస్తున్న ఛానెల్స్ ఇదంతా కవర్ చేస్తూనే ఉన్నాయి. ఓవైపు లోకేష్ మంత్రిగా ప్రమాణం చేయడానికి పోడియం దగ్గరకు చేరుకునేదాకా కూడా ఆ సీన్ ని చూపించలేకపోయాయి. అంటే లోకేశ్ కంటే పవన్ కే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడంతో టీడీపీ నేతలు చిన్నబుచ్చుకున్నారట.
మంత్రులందరి ప్రమాణ స్వీకార కార్యక్రమం అయ్యా… ప్రధాని మోడీ చేసిన మరో పనితో టీడీపీ శ్రేణులు షాక్ అయ్యాయి. చంద్రబాబు మోడీతో మాట్లాడుతుండగానే…. మా అన్నయ్యను పలకరించాలి రండి అంటూ… మోడీ చెవిలో గుస గుసగా చెప్పాడు పవన్. దాంతో పవన్ ను లాక్కొని వెళ్ళిన మోడీ.. అక్కడ … చిరంజీవి, పవన్ కల్యాణ్ తో ఆప్యాయంగా నవ్వుతూ మాట్లాడారు. ఇద్దరి చేతులు పైకెత్తి… సభలో పాల్గొన్న జనానికి అభివాదం చేశారు.

అన్నాదమ్ముల ఇద్దరి చేతుల్ని మోడీ చాలాసేపు అలాగే పట్టుకొని మాట్లాడటం… మెగా ఫ్యాన్స్ తో పాటు జనసైనికులు హ్యాపీగా ఫీలయ్యారు. అయితే పవన్ ని లాక్కొని మోడీ వెళ్ళిన సందర్భంలో… వాళ్ళ వెనుకే చంద్రబాబు వస్తున్నా… ఆయన్ని మాత్రం ఆ ఇద్దరూ పట్టించుకోలేదు. మెగా, పవర్ స్టార్స్ చేతుల్ని మోడీ పైకెత్తినప్పుడు…. చంద్రబాబు వాళ్ళ వెనుకే ఉన్నా… ముగ్గురూ బాబును లైట్ తీసుకున్నారు.
అంతకుముందు మెగా ఫ్యామిలీ అంతా హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో బయల్దేరి విజయవాడకు వచ్చింది. నారా, నందమూరి కుటుంబసభ్యులు కూడా ఈ కార్యక్రమం చూడ్డానికి హాజరైనప్పటికీ… అంత ప్రియారిటీ దక్కలేదన్న టాక్ టీడీపీ వర్గాల్లో నడుస్తోంది. లోకేశ్ నే కాదు… నటసింహం బాలయ్య బాబును కూడా స్టేజ్ మీద లైట్ తీసుకోవడం నందమూరి అభిమానులను హర్ట్ చేసింది. హిందూపురం నుంచి హ్యాట్రిక్ కొట్టినా… బాలకృష్ణకు ఈసారి కూడా మంత్రిపదవి దక్కలేదు. అలాగే స్టేజ్ మీద ఆయన్ని పట్టించుకున్నవాళ్ళే లేరు.

మోడీ కూడా పవన్, చిరంజీవికి ఇచ్చిన ప్రియారిటీ బాలకృష్ణకు ఇవ్వకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ బాధపడ్డారు. పాపం… బాలయ్య బాబే… స్టేజీ మీద అటూ ఇటూ తిరుగుతూ గెస్టులందర్నీ పలకరించారు.
మొత్తానికి స్టేజ్ ని మోడీ, పవన్ కళ్యాణ్, చిరంజీవి బాగా వాడేసుకున్నారని టీడీపీ వర్గాలు తెగ బాధపడిపోతున్నాయి. 2014లో పవన్ కల్యాణ్ టీడీపీకి మద్దతు ఇచ్చినా… ఆయనకంత సీన్ లేదు… మేమే సొంతంగా అధికారంలోకి వచ్చామన్న ఫీలింగ్ టీడీపీ లీడర్లలో కనిపించేది… కానీ ఈసారి టీడీపీ అండ్ కూటమి పవర్ లోకి రావడానికి పవర్ స్టార్ మేనియా ఖచ్చితంగా ఉపయోగపడింది. ఆ విషయం చంద్రబాబు, లోకేశ్ కూడా ఒప్పుకున్నారు. కానీ ప్రమాణం స్టేజీని మెగా ఫ్యామిలీ కబ్జా చేయడం చూస్తుంటే… రాబోయే ఐదేళ్ళ పాలనలోనూ… ఇదే డామినేషన్ చూపిస్తారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు.