2024 General Elections : దేశంలో మోగిన ఎన్నికల నగారా.. సార్వత్రిక ఎన్నికలతో పాటు.. 4 రాష్ట్రాల్లో ఎన్నికలు
దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూపులకు.. ఆ సమయం రానే వచ్చింది. దేశంలో ఎన్నికల నగారా మోగింది. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. నేటి నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. 18వ లోక్ సభ ఎన్నికలతో పాటు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా వివిధ దశల్లో నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించింది.

Mogai is the election town in the country.. along with the general elections.. elections in 4 states
దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూపులకు.. ఆ సమయం రానే వచ్చింది. దేశంలో ఎన్నికల నగారా మోగింది. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. నేటి నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. 18వ లోక్ సభ ఎన్నికలతో పాటు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా వివిధ దశల్లో నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించింది. కాగా అసెంబ్లీ ఎన్నికలు 3 దశల్లో నిర్వహించనున్నారు కేంద్ర ఎన్నికల సంఘం.. వీటిలో తెలంగాణ తో పాటుగా పలు రాష్ట్రాల్లోని 26 ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికలు 7 దశల్లో జరగనుండగా, ఏప్రిల్ 19 నుంచి పోలింగ్ జరగనుంది. అన్ని అసెంబ్లీలు, ఉప ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న చేపట్టనున్నారు.
ఈ సాధారణ ఎన్నికల్లో మొత్తం 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. అందులో కోటీ 82 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 12 లక్షల పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 55 లక్షల ఈవీఎంలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల విధుల్లో మొత్తం 1.5 కోట్ల మంది ఉద్యోగులు పాలుపంచుకోనున్నారని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికలు..
ఆంధ్రప్రదేశ్ లో మే 13, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో మే 19న, ఒడిశాలో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 13న ఒకటోవ దశ.. మే 20న రెండో దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీలో జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ఏపీ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల కానుండగా… ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన జరుపుతారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు గడువు విధించారు.
7 దశల వారిగా లోక్ సభ ఎన్నికలు..
ఇక లోక్ సభ ఎన్నికలను దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో నిర్వహిస్తున్నారు. తొలి దశ ఎన్నికలకు మార్చి 20న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఏప్రిల్ 19న పోలింగ్ జరుతుంది. రెండో దశ ఎన్నికలకు మార్చి 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 26న పోలింగ్ నిర్వహించనున్నారు. మూడో దశ లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 12న విడుదల కానుంది. మే 7న పోలింగ్ జరుగనుంది. మూడో విడతలో 12 రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 13న పోలింగ్ నిర్వహిస్తారు. ఈ విడతలో ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుయి. ఐదో విడత లోక్ సభ ఎన్నికలకు మే 20న పోలింగ్ జరగనుంది.
ఆరో విడత లోక్ సభ ఎన్నికలకు ఏప్రిల్ 29న నోటిఫికేషన్ విడుదల కానుండగా, మే 25న పోలింగ్ జరగనుంది. ఏడో విడత ఎన్నికలకు మే 7న నోటిఫికేషన్ విడుదల కానుండగా, జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి.
దేశలో ముగియనున్న లోక్ సభ.. అసెంబ్లీ గడువు సమయం..
17వ లోక్ సభ గడువు జూన్ 16తో ముగియనుండగా… అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీల గడువు జూన్ 2న, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16న, ఒడిశా అసెంబ్లీ గడువు జూన్ 24న ముగియనున్నాయి.
SURESH.SSM