MP Madhav’ : ఎంపీ మాధవ్ కథ కంచికే.. సీటు లేదని చెప్పేసిన జగన్

హిందూపురం ఎంపీ మాధవ్ విషయంలో అదృష్టం ఫ్రంట్ డోర్ తడితే.. దురదృష్టం మాస్టర్‌ బెడ్‌రూమ్‌లో ముసుగు తన్ని పడుకుందట. రాజకీయాల్లో చాలా మందికి రాని అవకాశం మాధవ్ కి అనుకోకుండా వచ్చేసింది. కానీ.. నిలబెట్టుకోకుండా విదాదాలతో కంపు చేసుకున్నారాయన. అందుకే ఈసారి సీటు లేదని అధినాయకత్వం చెప్పేసిందట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 30, 2023 | 02:09 PMLast Updated on: Dec 30, 2023 | 2:09 PM

Mp Madhavs Story Is Kanchike Jagan Said That There Is No Seat

 

హిందూపురం ఎంపీ మాధవ్ విషయంలో అదృష్టం ఫ్రంట్ డోర్ తడితే.. దురదృష్టం మాస్టర్‌ బెడ్‌రూమ్‌లో ముసుగు తన్ని పడుకుందట. రాజకీయాల్లో చాలా మందికి రాని అవకాశం మాధవ్ కి అనుకోకుండా వచ్చేసింది. కానీ.. నిలబెట్టుకోకుండా విదాదాలతో కంపు చేసుకున్నారాయన. అందుకే ఈసారి సీటు లేదని అధినాయకత్వం చెప్పేసిందట.

రాజకీయంగా అవకాశం రావడం ఒక ఎత్తయితే.. దాన్ని పది కాలాల పాటు పదిలంగా కాపాడుకోవడం మరో ఎత్తు. పదవుల కోసం కొందరు దశాబ్దాల తరబడి ఓపిగ్గా ఎదురు చూస్తుంటారు. కానీ.. మరికొందరికి మాత్రం ఓవర్‌ నైట్‌లో తలుపు తడుతుంటాయి. అలాంటి కొద్ది మందిలో ఒకరు హిందూపురం ఎంపీ గోరంట్ల మాథవ్‌. గత లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టం మెయిన్‌ గుమ్మం డోర్లు బద్దలు కొట్టుకుని మరీ ఆయన ఇంట్లోకి వచ్చేసింది. కానీ.. ఐదేళ్ళు గడిచేసరికి దొడ్డి గుమ్మం నుంచి కామ్‌గా వెళ్ళిపోయింది. దీంతో.. వన్‌టైమ్‌ ప్రజాప్రతినిధిగా మిగిలిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

అసలు గోరంట్ల మాధవ్‌ అన్న పేరు వినగానే.. ఒక ఎంపీగా కంటే.. వివాదాస్పద వ్యక్తిగానే గుర్తుకు వస్తాడని, కాంట్రవర్శల్‌ వైబ్రేషన్స్‌ పెరిగిపోతాయని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఒక్కప్పుడు ఎస్ఐగా కెరీర్‌ ప్రారంభించిన మాధవ్‌ సీఐగా ప్రమోట్‌ అయ్యాక స్టైల్ మారిపోయింది. సినిమాల ప్రభావమో లేక.. ఇన్‌బిల్ట్‌ క్యారెక్టరో తెలియదు కానీ.. డ్యూటీలో ఉన్నప్పుడు గబ్బర్‌సింగ్‌ క్యారెక్ట్‌ను ఆవహించుకునే వారన్నది లోకల్‌ టాక్‌. పోలీస్‌ ఆఫీసర్‌గా ఉంటూనే.. నాటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీద మీసం తిప్పడం ఉమ్మడి రాష్ట్రంలో సంచలమైంది. చేసేది పోలీస్‌ ఉద్యోగమైనా.. ఆయన టార్గెట్‌ మాత్రం రాజకీయాలన్నది అప్పట్లో చెప్పుకున్న మాట. అందుకు తగ్గట్టుగా.. 2014లోనే టికెట్ కోసం ప్రయత్నించారట గోరంట్ల మాధవ్. కానీ…అప్పుడు విఫలం కావడంతో.. 2019 నాటికి మరింత జనంలో నానేలా చేసుకున్నారు. ఇదే ఆయన పొలిటికల్ ఎంట్రీకి గేట్లు తెరిచింది. ఎంపీ టిక్కెట్‌ కన్ఫామ్ చేసుకున్నాకే పోలీస్‌ ఉద్యోగం నుంచి వీఆర్ఎస్ తీసుకుని వైసీపీలో చేరారు మాధవ్‌. హిందూపురం ఎంపీ టిక్కెట్‌ రావడం, గెలవడం చకచకా జరిగిపోయాయి.

ఇలా.. చాలా మందికి దక్కని అదృష్టం హిందూపురం ఎంపీకి వచ్చిందనే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కానీ.. ఈ మాజీ పోలీస్‌ ఎంత ఫాస్ట్ గా రాజకీయాల్లోకి వచ్చి ఎదిగాడో.. అంతకంటే ఫాస్ట్‌గా తన రివర్స్‌ గేర్‌ తానే వేసుకున్నాడన్నది విస్తృత అభిప్రాయం. గతంలో పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాడో.. ప్రజాప్రతినిధి అయ్యాక కూడా అదే తీరు కనిపించింది. కేరాఫ్‌ కాంట్రవర్శీగా మారిపోయారాయన. ఎంపీ అయిన తొలినాళ్లలో కియా కార్ల పరిశ్రమలో ఓపెనింగ్‌కు వెళ్లి.. అక్కడ నానా రచ్చ చేశారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతి పక్షాలకు అది ఆయుధంగా మారింది. దీని నుంచి బయట పడేసరికి అసలు ఆయన జీవితంలో ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. వ్యక్తిగత వీడియో కాల్‌ వల్ల జరిగిన డ్యామేజ్‌ అంతా ఇంతా కాదు. అది ఏకంగా హిందూపురం గల్లీ నుంచి ఢిల్లీలోని పార్లమెంట్ భవన్‌దాకా వెళ్ళింది. దాని గురించి సర్దిచెప్పుకోలేక వైసీపీ అగ్రనాయకులే తలలు పట్టుకోవాల్సి వచ్చింది.

ఆ గొడవ సద్దుమణుగుతోందని అనుకుంటుండగానే.. ఇంటి అద్దె వివాదం మరోసారి ఆయన పరువు తీసింది. ఆ క్రమంలోనే చంద్రబాబు విషయంలో చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని మరోసారి ఇరుకున పెట్టాయి. బాబు జైలులో ఉన్నప్పుడు భద్రత లేదని టీడీపీలో టాప్‌ టు బాటమ్‌ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తుంటే.. ఎంపీ గోరంట్ల మాధవ్ వాటికి బలం చేకూర్చేలా 2024లో చంద్రబాబు చనిపోతారని వివాదాస్పద కామెంట్ చేశారు. దీంతో టీడీపీ నేతలకు మరో ఆయుధం దొరికినట్టయింది. అసలు మాధవ్ వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏంటి.. ఆయన్ని జైల్లోనే చంపాలనుకుంటున్నారా.. అంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం జరిగింది. ఇలా ఏ పొలిటీషియన్ కు లేని విధంగా వరుస వివాదాల్లో ఇరుక్కున్నారు మాధవ్‌. దీంతో అధిష్టానం ఆయనకు టిక్కెట్ ఇచ్చే విషయంలో పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఈ సారి మాధవ్ కు దాదాపు అన్ని దారులు మూసుకుపోయినట్లు ప్రచారం సాగుతోంది. ఇలా మాధవ్ రాజకీయాల్లో ఎవరూ ఊహించనంత వేగంగా వచ్చి.. అంతే వేగంగా వెనుక్కు తిరగాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు పరిశీలకులు. మరి వైసీపీ అధిష్టానం ఆ నిర్ణయమే ఫైనల్‌ అని చెప్పేస్తుందా లేక మరోసారి పరిశీలించే అవకాశం ఉందా అన్నది చూడాలి.