Mudragada : నాన్నగారు.. మూస్కుంటే బెటర్.. ముద్రగడకు కూతురు షాక్…
పిఠాపురంలో పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని సవాల్ విసిరిన ముద్రగడ.. అన్నంత పనిచేశారు. దీంతో ఇప్పుడు ముద్రగడ.. పద్మనాభ రెడ్డిగా మారిపోయారు.
పిఠాపురంలో పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని సవాల్ విసిరిన ముద్రగడ.. అన్నంత పనిచేశారు. దీంతో ఇప్పుడు ముద్రగడ.. పద్మనాభ రెడ్డిగా మారిపోయారు. ఇలా పేరు మార్చుకున్నారో లేదో.. అలా పవన్‌ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. తనను బూతులు తిట్టించడం ఆపి, ముందు కాపు రిజర్వేషన్ సంగతి తేల్చాలని చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పవన్ చెప్పినట్టు వింటాయని… ఇలాంటి అవకాశం ఉన్న సమయంలోనే కాపులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ముద్రగడ.
ఇలాంటి సమయంలో ముద్రగడకు సొంత కూతురు నుంచే మళ్లీ షాక్ తగిలింది. ఎన్నికల ముందు జరిగిన పరిణామాలు.. తండ్రీకొడుకులను విడదీశాయ్. ఐతే ఇప్పుడు ఇలా పవన్‌ను ముద్రగడ ఓ మాట అన్నారో లేదో.. ఆయన కూతురు క్రాంతి ఫైర్ అవుతున్నారు. పవన్‌ని ప్రశ్నిస్తావా నాన్నా.. అంటూ ముద్రగడ కుమార్తె క్రాంతి ఓ ఘాటు ట్వీట్ వేశారు. తన తండ్రి ఇక ఇంటికి పరిమితం అయి విశ్రాంతి తీసుకుంటే బెటర్ అంటూ హితవు పలికారు. ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి తన భర్తతో సహా పవన్ కల్యాణ్‌ని కలిశారు. జనసేనకు జై కొట్టారు. తండ్రి వైసీపీకి మద్దతు తెలపగా.. కుమార్తె క్రాంతి జనసేన గెలవాలని కోరుకున్నారు. అప్పట్లో తన కుమార్తె తన ఆస్తి కాదంటూ ముద్రగడ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయ్. మళ్లీ ఇప్పుడు ఆ వివాదం మొదలైంది. తండ్రిపై కుమార్తె ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి పేరు పద్మనాభరెడ్డిగా మారినా.. ఆయన ఆలోచనా విధానం మాత్రం మారలేదన్నారు క్రాంతి.
గతంలో జగన్‌ని ఏనాడూ ప్రశ్నించని ముద్రగడ.. ఇప్పుడు పవన్ కల్యాణ్‌ని ప్రశ్నించడమేంటని నిలదీశారు. జగన్‌ని ప్రశ్నించలేని తన తండ్రికి ఇప్పుడు పవన్‌ని ప్రశ్నించే అర్హత ఎక్కడిదన్నారు. పేరు కూడా మార్చుకున్నాక కాపుల గురించి ఆయన ఎందుకు మాట్లాడుతున్నారని అడిగారు. సమాజానికి ఏం చేయాలనే విషయంలో పవన్ కల్యాణ్‌కు స్పష్టత ఉందని, తన తండ్రికి మాత్రం లేదనిపిస్తోందని చెప్పారు. తన తండ్రి శేష జీవితాన్ని ఇంటికే పరిమితం చేసి విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇస్తున్నానని, మరో దఫా పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తే గట్టిగా ప్రతిఘటించాల్సి వస్తుందని ట్వీట్‌లో తండ్రికి వార్నింగ్ ఇచ్చారు క్రాంతి.