Pawan vs Mudragada : పవన్ పై ముద్రగడ పోటీ.. జగన్ మాస్టర్ ప్లాన్
ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ని ఓడించడానికి వైసీపీ (YCP) అధినేత జగన్ పక్కాన్ ప్లాన్ వేస్తున్నారు. పవన్ పిఠాపురంలో పోటీ చేస్తాడన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికే అక్కడ జనసేన తరపున రెండు సర్వేలు కూడా జరిగాయి.

Mudragada competition on Pawan.. Jagan's master plan
ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ని ఓడించడానికి వైసీపీ (YCP) అధినేత జగన్ పక్కాన్ ప్లాన్ వేస్తున్నారు. పవన్ పిఠాపురంలో పోటీ చేస్తాడన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికే అక్కడ జనసేన తరపున రెండు సర్వేలు కూడా జరిగాయి. దాంతో అక్కడ జనసేనానికి చెక్ పెట్టడానికి ఏకంగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను పోటీకి దించాలన్నది జగన్ ప్లాన్ (CM Jagan). పవన్ – ముద్రగడ (Mudragada Padmanadham) మధ్య పెరుగుతున్న దూరాన్ని క్యాష్ చేసుకోడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది.
తాడేపల్లిగూడెం మీటింగ్ లో తనకు సలహాలు ఇవ్వొద్దని పవన్ కల్యాణ్ స్వీట్ వార్నింగ్ ఇవ్వడం కాపు నేతల్లో కలకలం రేపింది. దీనిపై కాపు నేతలు హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం వెంటనే రియాక్ట్ అయ్యారు. ఇక తమతో పనిలేదా అని జోగయ్య లెటర్ రాస్తే… చంద్రబాబు చెప్పిన మాట వింటున్నారని ముద్రగడ లేఖ రాశారు. ఈ ఇద్దరు కాపు నేతలతో పవన్ కల్యాణ్ కి దూరం పెరుగుతుండటంతో… వాళ్ళిద్దరితో టచ్ లోకి వెళ్ళింది వైసీపీ.
ముద్రగడ కొడుకు గిరితో సంప్రదింపులు మొదలుపెట్టారు వైసీపీ లీడర్లు. ముద్రగడను వైసీపీలోకి చేర్చుకొని… పిఠాపురంలో పవన్ పై పోటీకి దించాలని ప్లాన్ చేస్తున్నారు. పద్మనాభం ఒప్పుకోకపోతే… గిరిని అయినా నిలబెట్టాలని చూస్తోంది వైసీపీ. ఫ్యాన్ పార్టీ నుంచి వచ్చిన ప్రపోజల్స్ ను తన తండ్రి దృష్టికి తెచ్చారు గిరి. ఈ ఎన్నికల్లో ముద్రగడతో పాటు గిరి కూడా నిలబడాలని ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు పిఠాపురంలో ముద్రగడను దించి… గిరికి తర్వాత ఏదైనా పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం వంగా గీత పిఠాపురం వైసీపీ ఇంఛార్జ్ గా ఉన్నప్పటికీ.. పవన్ ఓడించడానికి ముద్రగడ బెటర్ అని ఆలోచిస్తున్నారు. అలాగే టీడీపీ (TDP) ఇంఛార్జ్ గా ఉన్న వర్మ పేరు కూడా వైసీపీ పరిశీలనలో ఉంది.
గతంలో పిఠాపురం నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన వర్మను లాక్కోవాలని కూడా వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే హరిరామ జోగయ్య కొడుకు సూర్యప్రకాష్ ను వైసీపీలోకి చేర్చుకున్నారు. ముద్రగడ కూడా తమ వైపు టర్న్ అయితే… టీడీపీ-జనసేన (TDP-JanaSena) కూటమి ఓట్లకు భారీగా గండిపడుతుందని జగన్ మాస్టర్ ప్లాన్ వేశారు. ముద్రగడతో సంప్రదింపులు మొదలయ్యాయి. దీనిపై రెండు, మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.