Mudragada : ముద్రగడ నామకరణ మహోత్సవం.. ఆడుకుంటున్న పవన్ ఫ్యాన్స్..
సోషల్ మీడియాలో.. ముద్రగడ నామకరణ మహోత్సవం అంటూ పవన్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఆహ్వానపత్రికలు డిజైన్ చేయించి మరీ.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Mudragada naming ceremony.. Pawan fans playing..
ఎన్నికల ముందు ముద్రగడ, జనసేన మధ్య జరిగిన యుద్ధం అంతా ఇంతా కాదు. పిఠాపురంలో పవన్ గెలిచే పరిస్థితే లేదని.. ఆయన గెలిస్తే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానంటూ.. మీడియా సాక్షిగా సవాల్ విసిరారు ముద్రగడ. ఐతే పిఠాపురంలో ఇప్పుడు భారీగా పోలింగ్ నమోదయింది. పవన్ కల్యాణ్‌కే ఓట్లు పడ్డాయని.. సేనాని విజయాన్ని ఇక ఎవరూ ఆపలేరని జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఫస్ట్ టార్గెట్‌గా ముద్రగడను సెలక్ట్ చేసుకున్నారు. సోషల్ మీడియా సాక్షిగా భారీ ట్రోలింగ్ చేస్తున్నారు.
ముద్రగడ నామకరణ మహోత్సవం అంటూ పవన్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఆహ్వానపత్రికలు డిజైన్ చేయించి మరీ.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఏమండీ.. మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించిన తర్వాత.. తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని మాట ఇచ్చిన పెద్దాయన… అతని మాటపై నిలబడతారని మాకు నమ్మకం ఉందండి. కావున అందరూ వచ్చి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా మా ప్రార్థన. మీ ఉప్మా కాపీలు మీరే తెచ్చుకోవాలండి అంటూ.. వెటకారంగా గోదావరి స్లాంగ్‌లో రాసుకొచ్చిన ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పవన్ ఫ్యాన్స్ చేసిన ఈ రచ్చ.. ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ ఎన్నికల్లో పవన్‌ను ఓడిస్తామని.. ఒకవేళ ఓడించలేకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని.. ముద్రగడ సవాల్ చేశారు. ఐతే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే సంకేతాలతో.. జనసైనికులు రెచ్చిపోతున్నారు. ముద్రగడను టార్గెట్ చేసుకున్నారు.