NANDAMURI BALAKRISHNA: ఇదేందయ్యా.. బాలయ్యా.. నోరు కంట్రోల్‌లో ఉండక్కర్లే..
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బాలయ్య తీరుపై ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇదే. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలని బాలకృష్ణ ఆర్డర్ వేయడంతో.. అభిమానులు, అనుచరులు ఆ ఫ్లెక్సీలను పీకేసిన ఘటన ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది.
NANDAMURI BALAKRISHNA: ఏమీ అనకుండానే.. ఏదో అన్నట్లు క్రియేట్ చేస్తారు రాజకీయాల్లో! ఎప్పుడు తప్పు చేస్తారా.. ఆ తప్పును ఆయుధంగా చేసుకుని, వాళ్లను ఇబ్బంది పెట్టాలని ప్రత్యర్థి ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటిది అవతలివాడికి మనమే ఆయుధమే అందించాలి అనుకుంటే.. బాలయ్య విషయంలో ఇప్పుడు వినిపిస్తున్న మాట ఇదే. బాలకృష్ణ.. ముక్కుసూటి మనిషి. ముక్కోపి అని తెలుసు అందరికీ! ఆ కోపం ఎందుకు వస్తుంది. మంచికా, చెడుకా.. మనోడు అనుకొని కోప్పడతాడా.. మనవడిని కోప్పడతాడా అన్న సంగతి తర్వాత.. ఆ కోపమే బాలయ్యకు చాలాసార్లు మైనస్ అయింది.
Mega Star Chiranjeevi: చిరంజీవికి పద్మ విభూషణ్.. మెగా సంబరం..?
బాలయ్య కోపం అంటే.. అది బాలయ్య ప్రేమ అని ఇండస్ట్రీలో డప్పు కొడతారేమో కానీ.. రాజకీయాల్లో అలా కాదు. తన కోపమే తన శత్రువు అనే మాట రాజకీయాల్లో పక్కాగా సరిపోతుంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బాలయ్య తీరుపై ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇదే. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలని బాలకృష్ణ ఆర్డర్ వేయడంతో.. అభిమానులు, అనుచరులు ఆ ఫ్లెక్సీలను పీకేసిన ఘటన ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. ఎన్నికల వేళ.. ఇది టీడీపీకి, నందమూరి కుటుంబానికి దెబ్బతీసే అంశం అంటూ ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌ను.. నందమూరి కుటుంబం పక్కనపెడుతుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. మధ్యలో జరిగిన పరిణామాలు.. ఈ ప్రచారాన్ని మరింత బలంగా మార్చాయ్. ఐతే ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణుగుతున్నాయ్ అనుకుంటే.. ఎన్టీఆర్ ఫ్లెక్సీ సాక్షిగా విభేదాలు మరోసారి బయటపడ్డాయ్. తారక్ ఫ్లెక్సీలు తొలగించాలని బాలయ్య ఆదేశించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో తారకర్ ఫ్యాన్స్.. బాలయ్య మీద ఫైర్ అవుతున్నారు. తమ హీరో బ్యానర్లు ఎందుకు తొలగించారంటూ మండిపడుతున్నారు.
ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా.. ఆస్కార్ నటుడిగా గుర్తింపు పొందిన తారక్‌కు నందమూరి కుటుంబం ఇచ్చే విలువ ఇదా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు అయితే.. బాలయ్య తీరు సరికాదు అంటూ పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబుకు మద్దతు ఇవ్వనంత మాత్రాన.. రాజకీయంగా మద్దతు ప్రకటించనంత మాత్రాన.. ఎన్టీఆర్‌ను ఇలా అవమానించాలా అంటూ ఫైర్ అవుతున్నారు. బాలయ్య ఇలా వ్యవహరించటం.. అది కూడా కుటుంబానికి సంబంధించిన విషయంలో ఇలా ప్రవర్తించడం తప్పని కామెంట్స్ చేస్తున్నారు. ఏమైనా ఒక్క ఘటన రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. కీలకమైన ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ విషయంలో బాలయ్య వ్యవహరించిన తీరు.. తొందరపాటు చర్య అని, ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందని మరికొందరి వాదన. ఏమైనా బాలయ్యా.. కాస్త కంట్రోల్‌లో ఉండాల్సిందియ్యా అంటూ మరికొందరు సలహాలు ఇస్తున్నారు ఉచితంగా!