Nara Lokesh : పవన్ కల్యాణ్ పాదాభివందనం చేసిన నారా లోకేష్

కలిసుంటే కలదు సుఖం అన్నట్లు పొత్తు పెట్టుకొని పోటీ చేసి అఖండ విజయాన్ని సాధించింది ఎన్డీయే కూటమి. ఈ సందర్భంగా టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu) ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 13, 2024 | 05:45 PMLast Updated on: Jun 13, 2024 | 5:45 PM

Nara Lokesh Who Saluted Pawan Kalyan

 

 

 

కలిసుంటే కలదు సుఖం అన్నట్లు పొత్తు పెట్టుకొని పోటీ చేసి అఖండ విజయాన్ని సాధించింది ఎన్డీయే కూటమి. ఈ సందర్భంగా టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Nara Chandrababu) ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సందర్భంగా స్టేట్‌పై కొన్ని అరుదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక తాజాగా మరో వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

ప్రమాణ స్వీకారం చేసిన లోకేష్ (Nara Lokesh) పీఎం నరేంద్ర మోడీ (PM Narendra Modi), గవర్నర్, తండ్రి చంద్రబాబు ఆశీర్వాదం తీసుకొని అక్కడే ఉన్న విశిష్ట అతిథుల అభినందనలు అందుకున్నారు. ఆ తరువాత జనసేనాని పవన్ కల్యాణ్ దగ్గరకు వచ్చి అప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. అనంతరం పాదాభి వందనం చేయబోగా పవన్ వద్దన్నట్లు, అయినా సరే ఆయన్ను ఒప్పించి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సర్క్యూలేట్ అవుతుంది.

జనసేన (Janasena), టీడీపీ కూటమిగా (TDP Alliance) ఏర్పడకముందు కూడా పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) ను లోకేష్ ఎక్కడా ఎలాంటి కామెంట్ చేయలేదు. అంతే కాదు పవన్ అన్న అంటూ సంబోధించారు. ఆయన్ను అన్నగా భావించే ఆశీర్వాదం తీసుకున్నాడు. కేసరపల్లి వేదికగా జూన్ 12 న చంద్రబాబు, నూతన మంత్రులు సైతం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలు సంఘటనలు ప్రేక్షకుల మనుసును దోచాయి. అందులో పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం తరువాత చిరంజీవికి పాదాభివందనం చేసుకోవడం, ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీనే వచ్చి పవన్, చిరంజీవి (Chiranjeevi) అన్నదమ్ములు చేతులను పట్టుకొని విజయోత్సాహాన్ని ప్రదర్శించడం, ఇప్పుడు లోకేష్ సంఘటన. ఇరు పార్టీలు ఇలాగే సంఘటీతంతో ముందుకు వెళితే ఏపీ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది అని ప్రజలు భావిస్తున్నారు.