NTR fans : చంద్రబాబును వెంటాడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌.. టీడీపీకి భారీ షాక్ తగలబోతోందా ?

చంద్రబాబు, నందమూరి కుటుంబానికి.. జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య సంబంధాలు బాగోలేవు అని క్లియర్‌గా అర్థం అవుతోంది. స్కిల్‌ స్కామ్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు నందమూరి కుటుంబసభ్యులు ప్రతీ ఒక్కరు రియాక్ట్ అయ్యారు. భువనేశ్వరితో కలిసి దీక్షల్లో కూర్చుకున్నారు. తారకరత్న వైఫ్ కూడా చంద్రబాబు కోసం రోడ్డెక్కారు. రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ములాఖత్ అయ్యారు. ఐతే ఆ సమయంలో ఎన్టీఆర్ మాత్రం.. కనీసం స్పందించలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 8, 2024 | 03:06 PMLast Updated on: Jan 08, 2024 | 3:06 PM

Ntr Fans Who Are Chasing Chandrababu Is Tdp Going To Get A Big Shock

చంద్రబాబు, నందమూరి కుటుంబానికి.. జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య సంబంధాలు బాగోలేవు అని క్లియర్‌గా అర్థం అవుతోంది. స్కిల్‌ స్కామ్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు నందమూరి కుటుంబసభ్యులు ప్రతీ ఒక్కరు రియాక్ట్ అయ్యారు. భువనేశ్వరితో కలిసి దీక్షల్లో కూర్చుకున్నారు. తారకరత్న వైఫ్ కూడా చంద్రబాబు కోసం రోడ్డెక్కారు. రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ములాఖత్ అయ్యారు. ఐతే ఆ సమయంలో ఎన్టీఆర్ మాత్రం.. కనీసం స్పందించలేదు. సోషల్‌ మీడియాలో సినిమాల గురించి, స్నేహితుల బర్త్‌డేల గురించి చెప్పిన ఎన్టీఆర్‌.. చంద్రబాబు అరెస్ట్ మీద చిన్న కామెంట్‌ కూడా చేయలేదు. పైగా అటు ఎన్టీఆర్‌ ప్రస్తావన వచ్చినప్పుడు.. డోంట్‌ కేర్ అంటూ బాలయ్య ఇచ్చిన రియాక్షన్‌ ఇంకా జనాల కళ్లముందే కదులుతోంది. ఐతే ఏపీలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయ్. పార్టీలన్నీ పొలిటికల్ మూడ్‌లోకి వెళ్లిపోయాయ్.

ఇలాంటి పరిణామాల మధ్య.. టీడీపీ సభల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ.. రాజకీయంగా కొత్త చర్చకు కారణం అవుతోంది. చంద్రబాబును.. ఎన్టీఆర్ అభిమానులు వెంటాడుతున్నారు. తిరువూరు, ఆచంట బహిరంగ సభల్లో రచ్చ చేశారు. చంద్రబాబు వేదిక మీదకు రావటానికి ముందే.. తారక్‌ ఫొటోలున్న బ్యానర్లు, జెండాలు పట్టుకుని ఫ్యాన్స్‌ సభలోకి ఎంటర్ అయ్యారు. సీఎం ఎన్టీఆర్ అంటూ అంటూ నినాదాలు చేశారు. దీంతో టీడీపీ వాలంటీర్లు వాళ్లను అడ్డుకున్నారు. జెండాలు, బ్యానర్లను లాగేసుకుని చించేశారు. జూనియర్ అభిమానులు కోపంతో ఊగిపోయారు. రెండు వైపులా పెద్ద గొడవలే కావడంతో.. ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయ్. రెండు సభల్లోనూ టీడీపీ కార్యకర్తలకు, అభిమానులకు మధ్య జరిగిన గొడవలే.. హైలైట్ అయ్యాయ్. ఇప్పుడే కాదు.

కుప్పంలో చంద్రబాబు ఎప్పుడు పర్యటించినా, సభలు నిర్వహించినా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బ్యానర్లు, జెండాలు పట్టుకుని కనిపిస్తున్నారు. కుప్పం మాత్రమే కాదు.. చంద్రబాబు, లోకేష్ సభలు ఎక్కడున్నా జూనియర్ ఫొటోలతో భారీ ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు కనిపిస్తున్నాయ్. అభిమానులు జూనియర్ ఫొటోలతో ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడం.. టీడీపీ నేతలు, వలంటీర్లు వాటిని చించేయటం మామూలయిపోయింది. ఒంగోలు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోనూ ఇవే పరిస్థితులు కనిపించాయ్. మరి ఇప్పుడు రచ్చ చేసేవాళ్లంతా.. టీడీపీ అభిమానులా.. ఎన్టీఆర్‌కు మాత్రమే అభిమానులా అనే చర్చ జరుగుతోంది. నిజంగా టీడీపీ అభిమానులు అయితే.. ఎన్నికల్లో సీన్ మారిపోయే అవకాశం ఉంది. అసలే ఓటు బ్యాంక్ చీలొద్దని.. జాగ్రత్తలు తీసుకుంటున్న చంద్రబాబుకు.. తారక్‌ ఫ్యాన్స్ రూపంలో మరో సవాల్ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్.