Pawan Kalyan 21 : పవన్ జీవితంలో 21 నెంబర్ చాలా స్పెషల్.. ఆ సీక్రెట్ ఏంటంటే!
మొదటి ఎంట్రీనే ఏకంగా డిప్యుటీ సీఎం హోదాలో ఇవ్వడంతో.. ఈ పరవ్‌ఫుల్ ఎంట్రీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇక్కడ అన్నిటి కంటే మరో ఇంట్రెస్టింగ్ విషయం పవన్ అసెంబ్లీకి వచ్చిన డేట్. జూన్ 21న ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా ప్రమాణస్వీకారం చేశారు.
ఏపీలో అసెంబ్లీ కొలువుదీరింది. మంత్రులతో పాటు ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో జనసేన అధినేత, డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా స్పెషల్‌గా నిలిచింది. పార్టీ పెట్టిన పదేళ్ల తరువాత పవన్ మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. జీవితంలో మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు.
మొదటి ఎంట్రీనే ఏకంగా డిప్యుటీ సీఎం హోదాలో ఇవ్వడంతో.. ఈ పరవ్‌ఫుల్ ఎంట్రీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇక్కడ అన్నిటి కంటే మరో ఇంట్రెస్టింగ్ విషయం పవన్ అసెంబ్లీకి వచ్చిన డేట్. జూన్ 21న ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా ప్రమాణస్వీకారం చేశారు. కూటమిలో భాగంగా పవన్ కళ్యాన్ 21 సీట్లు తీసుకున్నారు. 21 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టారు. 21 కి 21 గెలిచారు. యాదృచ్ఛికంగా అదే 21వ తేదీన ఆ 21 మందితో అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు.
దీంతో 21 నెంబర్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఫస్ట్ ఎంట్రీ ఐనా బెస్ట్ ఎంట్రీ ఇచ్చావ్ అన్నా అంటూ.. పవన్ ప్రమాణస్వీకారం వీడియోలను ట్రెండ్ చేస్తున్నారు. తీసుకున్న 21 సీట్లలో గెలిచి 100 సక్సెస్ రేట్‌తో దేశం చూపు నీవైపు తిప్పుకునేలా చేశావంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు జనసేన పార్టీ నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు చెప్తూ ప్రమాణస్వీకారం వీడియోలను వైరల్ చేస్తున్నారు.