Basavatharakam 24th Anniversary : బసవతారకం 24వ వార్షికోత్సవం లో సీఎం రేవంత్.. నేటి నుంచి చంద్రబాబు తోనే నా పోటీ
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ 24వ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవంకు తెలంగాణ రాష్ట్రం సీఎం సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ 24వ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవంకు తెలంగాణ రాష్ట్రం సీఎం సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ సీఎంకు బసవతారకం ఆస్పత్రి మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ, డాక్టర్ నోరి దత్తాత్రేయుడు.. స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ బసవతారకం ఆసుపత్రి లక్షలాది మందికి సేవలందిస్తోందన్నారు.
బసవతారకం 24వ వార్షికోత్సవం లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం..
మా అన్న నందమూరి బాలకృష్ణ బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని నన్ను ఆహ్వానించారు ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.. తెలంగాణ ముఖ్యమంత్రిగా నాకు ఇదొక మంచి అవకాశం. ఎన్టీఆర్ ఆలోచనతో చంద్రబాబు నాయుడు సహకారంతో 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని కోట్లాది మందికి సేవలు అందించిన ఈ సంస్థ.. మరోవైపు బసవతారకం ఆస్పత్రికి అండగా ఉంటాం.. రెండు తెలుగు రాష్ట్రాలు ఇండియాలోనే ప్రగతి పథంలో ఉండాలని కోరుకుంటాను.. తెలంగాణ ప్రభుత్వం నిర్మించే హెల్త్ టూరిజం హబ్లో బసవతారకం ఆసుపత్రికి స్థలం కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. శంషాబాద్లో 500-1000 ఎకరాల్లో హబ్ ఏర్పాటుకు యోచన చేస్తున్నట్లు సమాచారం..
చంద్రబాబు కన్న ఎక్కవు పని చేస్తా..
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.
ఈ బసవతారక వార్షికోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఏపీ సీఎం నారా చంద్రబాబు గురించి ప్రస్తావిస్తూ.. చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం తనకు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు 18 గంటలు పని చేసి, తాను 12 గంటలు పని చేస్తే సరిపోదని అన్నారు. రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పని చేయాల్సిందేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.