Pawan kalyan: పార్టీ కోసం పవన్ ఆస్తుల అమ్మకం.. డయల్ న్యూస్ కథనాలపై ఫేక్ క్యాంపెయిన్ ..
పవన్ కల్యాణ్ పార్టీ కోసం తన సొంత ఆస్తులు అమ్ముకుంటున్నాడంటూ డయల్ న్యూస్ ఇచ్చిన కథనాలను కొందరు కేటుగాళ్ళు మార్ఫింగ్ చేశారు. పార్టీ అమ్ముకుంటున్నట్టుగా డయల్ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసిందంటూ ఫేక్ న్యూస్ ని సర్క్యులేట్ చేస్తున్నారు.
Pawan kalyan: పవన్ కల్యాణ్ పార్టీ కోసం తన సొంత ఆస్తులు అమ్ముకుంటున్నాడంటూ డయల్ న్యూస్ ఇచ్చిన కథనాలను కొందరు కేటుగాళ్ళు మార్ఫింగ్ చేశారు. పార్టీ అమ్ముకుంటున్నట్టుగా డయల్ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసిందంటూ ఫేక్ న్యూస్ ని సర్క్యులేట్ చేస్తున్నారు.
అసలు కథనం ఇది….
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఖర్చుల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సొంత ఆస్తులను అమ్ముకుంటున్నట్టు డయల్ న్యూస్ యూట్యూబ్ ఛానెల్ లో కథనాలు ప్రసారం చేశాం. పార్టీ నిర్వహణకు, అభ్యర్థులను నిలబెట్టడానికి డబ్బులు లేకపోవడంతో.. పవన్ తాను సినిమాల్లో నటించి సంపాదించుకున్న ఆస్తులు ఒక్కోటి అమ్ముతున్నారు. తన ఆస్తులు అమ్మి దాదాపు 100 కోట్ల రూపాయల దాకా ఎన్నికల ఖర్చులకు రెడీ చేయాలన్నది పవన్ టార్గెట్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో 20 కోట్ల రూపాయల స్థలాన్ని ఓ పారిశ్రామికవేత్తకు ఇప్పటికే అమ్మేశారు. మరికొన్ని ఆస్తులు అమ్మేసే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఈ మధ్య జనసేన పార్టీ నిర్వహణకు.. ఫ్లైట్లలో తిరగడానికి 20 కోట్ల రూపాయల దాకా ఖర్చయ్యాయి. గత నెలలోనే పవన్ 10 కోట్ల రూపాయలను పార్టీ ఫండ్ గా ఇచ్చారు. తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును కూడా ఆయన భరిస్తున్నారు. అందుకోసం ఒక్కో అభ్యర్థికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. అంత మొత్తం ఇవ్వడానికి జనసేన దగ్గర ఫండ్ లేదు. అందుకే సొంత ఆస్తులు అమ్మక తప్పట్లేదని సన్నిహితులకు పవన్ చెప్పినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఇంటి స్థలాన్ని గత వారమే అమ్మేశారు పవన్ కల్యాణ్. పాలిటిక్స్ లోకి వచ్చినవారు వేలు, లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకుంటారు. నాలుగైదు తరాలకు సరిపడా సంపాదిస్తారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం.. తాను సినిమాల్లో నటించి.. ఆ వచ్చిన డబ్బులను రాజకీయాలకు ఖర్చుపెడుతున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే మనస్తత్వం ఉన్న పవన్.. తన దగ్గరకు వచ్చి అడిగిన వారికి ఎందరికో సాయం చేశారు.
డయల్ న్యూస్ పేరుతో ఫేక్ క్యాంపెయిన్
కానీ కొందరు కేటుగాళ్ళు పవన్ పార్టీని అమ్ముతున్నట్టుగా డయల్ న్యూస్ ప్రచారం చేసినట్టు మార్ఫింగ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని డయల్ న్యూస్ విజ్ఞప్తి చేస్తోంది. మా యూట్యూబ్ ఛానెల్ లో ప్రసారమైన అసలు కథనాన్ని ఒకసారి చూడండి. ఫేక్ న్యూస్ నమ్మవద్దు.
Dial News లో ప్రసారమైన అసలు కథనాలు ఇవే :