Pawan Kalyan sold assets : ఆస్తులు అమ్మేస్తున్న పవన్ కల్యాణ్…. !
రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం సొంత ఆస్తులను అమ్ముకుంటున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేద్దామని జనసేన పార్టీ పెట్టారు పవన్. కానీ పార్టీ నిర్వహణకు, అభ్యర్థులను నిలబెట్టడానికి డబ్బులు లేకపోతే ముందుకు పోలేని పరిస్థితి. అందుకే పవన్ కల్యాణ్ తాను సినిమాల్లో నటించి సంపాదించుకున్న ఆస్తులు ఒక్కోటి అమ్ముతున్నారు. తన ఆస్తులు అమ్మి దాదాపు 100 కోట్ల రూపాయల దాకా ఎన్నికల ఖర్చులకు రెడీ చేయాలన్నది పవన్ టార్గెట్.
Pawan Kalyan sold assets : రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం సొంత ఆస్తులను అమ్ముకుంటున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేద్దామని జనసేన పార్టీ పెట్టారు పవన్. కానీ పార్టీ నిర్వహణకు, అభ్యర్థులను నిలబెట్టడానికి డబ్బులు లేకపోతే ముందుకు పోలేని పరిస్థితి. అందుకే పవన్ కల్యాణ్ తాను సినిమాల్లో నటించి సంపాదించుకున్న ఆస్తులు ఒక్కోటి అమ్ముతున్నారు. తన ఆస్తులు అమ్మి దాదాపు 100 కోట్ల రూపాయల దాకా ఎన్నికల ఖర్చులకు రెడీ చేయాలన్నది పవన్ టార్గెట్.
రాబోయే ఎన్నికల ఖర్చుకోసం ఇళ్ల స్థలాలు అమ్మడానికి పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో 20 కోట్ల రూపాయల స్థలాన్ని ఇప్పటికే అమ్మేశారు. పవన్ నుంచి ఓ పారిశ్రామికవేత్త ఈ స్థలం కొన్నట్టు తెలుస్తోంది. మరికొన్ని ఆస్తులు అమ్మేసే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఈ మధ్య జనసేన పార్టీ నిర్వహణకు… ఫ్లైట్లలో తిరగడానికి 20 కోట్ల రూపాయల దాకా ఖర్చయ్యాయి. గత నెలలోనే పవన్ 10 కోట్ల రూపాయలను పార్టీ ఫండ్ గా ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలకు జనసేన పార్టీకి కనీసం 100 కోట్లయినా కావాలని పవన్ కల్యాణ్ డిసైడ్ అయ్యారు. తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును కూడా ఆయన భరిస్తున్నారు. అందుకోసం ఒక్కో అభ్యర్థికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. అంత మొత్తం ఇవ్వడానికి జనసేన దగ్గర ఫండ్ లేదు. అందుకే సొంత ఆస్తులు అమ్మక తప్పట్లేదని సన్నిహితులకు పవన్ చెప్పినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఇంటి స్థలాన్ని గత వారమే అమ్మేశారు పవన్ కల్యాణ్.
పాలిటిక్స్ లోకి వచ్చినవారు వేలు, లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకుంటారు. నాలుగైదు తరాలకు సరిపడా సంపాదిస్తారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం… తాను సినిమాల్లో నటించి… ఆ వచ్చిన డబ్బులను రాజకీయాలకు ఖర్చుపెడుతున్నారు. పార్టీ నిర్వహణ కోసమే కాదు… అప్పుడప్పుడు ఏవైనా దుర్ఘటనలు జరిగినప్పుడు… ఆదుకోవాలని అడిగిన వాళ్ళకు కూడా పవన్ సాయం చేస్తుంటాడు. ఆయనకు ఆస్తుల కంటే అప్పులే ఎక్కువని గతంలో ఆయన బ్రదర్ నాగబాబు కూడా చెప్పారు. 2014లో జనసేన పార్టీ పెట్టినప్పుడు పిల్లల పేరున ఉన్న ఫిక్సుడ్ డిపాజిట్లు విత్ డ్రా చేసినట్టు చెబుతుంటారు. ఎక్కువగా EMIల మీదే పవన్ ఏవైనా కొంటారని అంటారు నాగబాబు.
జనసేన పెట్టినప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో ముందుకు వచ్చారు పవన్ కల్యాణ్. 2019లోనూ దాదాపు ఇదే మెథడ్ ఫాలో అయ్యారు. కానీ ఆశించిన ఫలితాలు రాలేదు. ఈమధ్య భీమవరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పవన్ ఇదే ఇష్యూపై మాట్లాడారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయాలని తానెప్పుడూ చెప్పలేదన్నారు. అయితే ఎన్నికల్లో డబ్బులతో ఓట్లు కొనండని చెప్పను… కనీసం మీటింగ్ కు వచ్చిన కార్యకర్తలకు భోజనాలు పెట్టడానికి అయినా డబ్బులు కావాలని అన్నారు. జనసేన 100 కోట్ల రూపాయల ఫండ్ సమకూర్చే పనిలో ఉన్న పవన్… మరో రెండు, మూడు స్థలాలను కూడా అమ్మకానికి పెట్టిన సమాచారం.