Pawan Kalyan, Road Show : పిఠాపురంలో పవన్ ప్రచారం.. 29, 30న పవన్ కళ్యాణ్ రోడ్ షో
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు ( AP General Elections).. అధికార పార్టీతో పాటుగా.. ప్రతిపక్ష పార్టీలు సైతం దుకుడు మీదా ఉన్నాయి. ఓవైపు అధికార పార్టీ సీఎం జగన్ సిద్ధం సభలు నిర్వహించి.. నిత్య ప్రజల్లో ఉండేటల్లు బస్సు యాత్రలు కూడా చేస్తున్నారు.

Pawan campaign in Pithapuram.. Pawan Kalyan road show on 29th and 30th
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు ( AP General Elections).. అధికార పార్టీతో పాటుగా.. ప్రతిపక్ష పార్టీలు సైతం దుకుడు మీదా ఉన్నాయి. ఓవైపు అధికార పార్టీ సీఎం జగన్ సిద్ధం సభలు నిర్వహించి.. నిత్య ప్రజల్లో ఉండేటల్లు బస్సు యాత్రలు కూడా చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు మహాకూటమి అయిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ప్రచారంలో సై అంటే సై అన్నట్లుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అదే కూటమిలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు రోజులు రోడ్ షో నిర్వహింస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ ఎన్నికల్లో జనసేన (Jana Sena) పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మహా కూటమిలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో పిఠాపురం (Pithapuram) లో పవన్ రెండు రోజులు రోడ్ షో చేస్తున్నట్లు.. ఈ నెల 29, 30న పవన్ రోడ్ షో ఉండనున్నట్లు పిఠాపురం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ వర్మ తెలిపారు. 29న గొల్లప్రోలు మండలం చెందుర్తి నుంచి రోడ్ షో ప్రారంభించి కొడవలి, వన్నెపూడి, మీదుగా పిఠాపురం మండలంలోకి ప్రవేశిస్తారు. అనంతరం వెల్దుర్తి, పి.తిమ్మాపురం మీదుగా రోడ్ షో సాగుతుందన్నారు. 30న చిత్రాడలో ప్రారంభమై గొల్లప్రోలు పట్టణంలో రోడ్ షో కొనసాగుతుందన్నారు.