AKIRA NANDAN : పవన్ ఇక ఫుల్ టైమ్ పొలిటీషియన్.. మెగా వారసుడిగా అకీరా
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం (Pithapuram) నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈనెల 12న ఏపీలో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. అంటే పవన్ కల్యాణ్ ఇక పూర్తి స్థాయి పొలిటీషియన్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం (Pithapuram) నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈనెల 12న ఏపీలో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. అంటే పవన్ కల్యాణ్ ఇక పూర్తి స్థాయి పొలిటీషియన్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. అదే టైమ్ లో అకీరా నందన్ ను సినిమాల్లో తన వారసుడిగా దింపుతారన్న టాక్ నడుస్తోంది. పవన్ పిఠాపురంలో గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో అకీరా (Akira) జనానికి కనిపించి… అందరికీ దండం పెట్టాడు. చేఎత్తి జై కొట్టాడు. ఆ తర్వాత చంద్రబాబు జనసేన ఆఫీసుకు వచ్చినప్పుడు ఆయన కాళ్ళకి మొక్కి ఆశీస్సులు తీసుకున్నాడు. ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీని కలిసినప్పుడు కూడా అకిరాను వెంట తీసుకెళ్ళాడు పవన్ కల్యాణ్. ఇక చిరంజీవి ఇంట్లో జరిగిన సంబరాల్లోనూ అకీరా స్పెషల్ అట్రాక్షన్ గా మారాడు. అంటే పవన్… తాను పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారి ప్రజా సేవ చేసుకుంటూ… తన స్థానంలో వెండి తెరపై అకీరాను దించుతారా ?
తనకు సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదనీ… అనుకోకుండా ఈ ఫీల్డ్ లోకి వచ్చానని పవన్ కల్యాణ్ తరుచుగా చెబుతుంటాడు. ఒకానొక దశలో సినిమాలు ఆపేయాలని కూడా అనుకున్నట్టు చెప్పాడు. గత వైసీపీ హయాంలో ఆయన సినిమాలు, రాజకీయాలను కంపేర్ చేస్తూ అప్పటి మంత్రులు, నేతలు విమర్శలు చేసేవారు. ఈ పరిస్థితుల్లో అకిరా నందన్ చేతికి రావడంతో… పవన్ పూర్తిస్థాయిలో సినిమాల నుంచి తప్పుకునే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దగ్గర ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇవి పూర్తయ్యాకే ఏ నిర్ణయమైనా తీసుకునే ఛాన్సుంది.
అకీరా నందన్ ఎప్పటికైనా వెండితెరపై కనిపిస్తాడని అతని తల్లి రేణూ దేశాయ్ చెబుతోంది. అకిరాకు నటనపై ట్రైనింగ్ కూడా ఇప్పించింది. 19యేళ్ళకే ఫిల్మ్ స్కూల్లో చేరాడు.
రాఘవేందరరావు మనువడు కార్తికేయ, అకిరా కలసి అమెరికాలో ఒకే చోట ఫిల్మ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అకిరాకు పియానో తెలుసు. మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉంది. మ్యూజిక్ తెలుసు. ఈమధ్య తనకు ఎడిటింగ్ కూడా వచ్చని ఆ స్కిల్ కూడా బయటపెట్టాడు. కానీ అకిరా వెండి తెరపైకి రావడానికి ఇంకా చాలా టైమ్ ఉందని రేణూ దేశాయ్ అంటోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న వయస్సులోనే అకీరా నందన్ కూడా హీరోగా మారే ఛాన్సుందని అంటున్నారు. ఒకట్రెండు యేళ్ళల్లోనే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్… అకీరాను వెండితెరపై చూసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.