YS Jagan : జగన్ బాటలోనే బాబు ,లోకేష్.. గిట్టని వారిపై ప్రతీకారం ప్రారంభం..

అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ చెప్పిన మొదటి మాట... ఎవరిపైన ప్రతీకారం తీర్చుకోము. ఉద్దేశ్ పూర్వకంగా ఎవ్వరిని టార్గెట్ చేయము. వాళ్లు తప్పులు చేస్తే, అవినీతికి పాల్పడితే, నేరాలు చేస్తే తప్ప ఎవరి వెంట పడము.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 27, 2024 | 11:30 AMLast Updated on: Jun 27, 2024 | 11:30 AM

Pawan Kalyan Chandrababu And Lokeshs First Words After Coming To Power We Will Not Take Revenge On Anyone

అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ చెప్పిన మొదటి మాట… ఎవరిపైన ప్రతీకారం తీర్చుకోము. ఉద్దేశ్ పూర్వకంగా ఎవ్వరిని టార్గెట్ చేయము. వాళ్లు తప్పులు చేస్తే, అవినీతికి పాల్పడితే, నేరాలు చేస్తే తప్ప ఎవరి వెంట పడము. కానీ అధికారంలోకి వచ్చి 24 గంటలు గడవక ముందే చంద్రబాబు, లోకేష్ తో మొదలుపెట్టి టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఎక్కడ వీలైతే అక్కడ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంది.

ఎకరం భూమి వెయ్యి రూపాయలకి లీజుకు తీసుకుని పార్టీ కార్యాలయాన్ని కట్టుకోవడం వైసీపీ మాత్రమే కాదు, టిడిపి కూడా అదే పని పదేళ్ల క్రితమే చేసింది. అక్కడికి తాను ఏదో సుద్దపూస అయినట్లు వైసీపీ పార్టీ కార్యాలయాలపై చర్యలు ప్రారంభించింది. సరే అనుమతి లేకుండా నిర్మాణాలు చేయడం తప్పే కాబట్టి వైసిపి పార్టీ కార్యాలయం మీద చర్య తీసుకోవాల్సిందే. కానీ చంద్రబాబు , లోకేష్ అయినదానికి కానిదానికి కూడా ప్రతీకారానికి దిగిపోతున్నారు . అన్నిటికంటే జనానికి ఎబ్బెట్టుగా అనిపిస్తున్నది హోం మంత్రి వంగలపూడి అనిత మాటలు.

ఆ పదవికి తగినట్లుగా గౌరవంగా ఉండాల్సింది పోయి, ఏదో వేరే పార్టీ వాళ్లంతా తన శత్రువులు లాగా, తన కాలి కింద నలిపేసే పురుగుల్లాగా అనిత మాట్లాడడం టిడిపి నేతలు ఎంత పగ ప్రతీకారాలతో ఎలా రగిలిపోతున్నారో చెప్పకనే చెప్తుంది. డిజిపి ఆఫీస్ లోకి ఫిర్యాదు ఇవ్వడానికి వస్తే నన్ను పోలీసులు అడ్డుకున్నారు ఇప్పుడు నాకు సెల్యూట్ లు కొడుతున్నారు అని అనడం ద్వారా అనిత తన అహంకారాన్ని, అవివేకాన్ని బయటపెట్టుకుంది. హోం మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకోగానే అనిత మాటలు వింటుంటే మధ్యతరగతి ఇళ్లల్లో మహిళలు కూడా ఆశ్చర్యపోయారు. వాడి సంగతి చూస్తా… వీడి సంగతి తేలుస్తా… అంటూ రాష్ట్ర హోం మంత్రి బజారు మనిషిలా మాట్లాడడం అందరికీ ఎబెట్టుగా అనిపించింది. ఇక అచ్చం నాయుడు నాయుడు సంగతి సరే సరి.

ఇది ప్రజాస్వామ్య పరిపాలన అనుకున్నా డో లేక నియంతృత్వ పాలన అనుకున్నా డో కానీ… ఎల్లో బ్యాడ్జి పెట్టుకొని వెళ్తే ఏ అధికారైనా ఎమ్మార్వో అయినా ,ఎండిఓ అయినా లేచి నిలబడి నమస్కారం పెట్టి టీ ఇచ్చి పని చేసి పంపించాలంట. లేదంటే వాళ్ళ అంతు తేలుస్తాడట. ఇక లోకేష్ ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే మీడియా ఛానల్స్ పైన పడ్డాడు. తెలుగులో మీడియా రెండు వర్గాలుగా ఎప్పుడో చీలిపోయింది. కమ్మ సామాజిక వర్గంతో కూడిన టిడిపి మీడియా ఒకటైతే, రెడ్డి ఇతర సామాజిక వర్గాలతో కూడిన వైసీపీ మీడియా మరొకటి. ఈటీవీ , ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5, మహా టీవీ, సివిఆర్ లాంటి పత్రికలు చానల్స్ అటు కమ్మ కులము, ఇటు పార్టీని దృష్టిలో పెట్టుకొని టిడిపిని భుజాలకి ఎత్తుకొని ఐదేళ్లు వైసీపీని, జగన్ ని డామేజ్ చేస్తూ చంద్రబాబు కె ప్రచారం చేశాయి. మరోవైపు వైసీపీ అధికార ఛానల్ సాక్షి, టీవీ9, ఎన్టీవీ, టీవీ9 ఇన్వెస్టర్కే చెందిన మరో ఛానల్ టెన్ టీవీ వైసీపీ నీ, జగన్ జగన్ని మోసాయి.

జగన్ అధికారంలో ఉన్నప్పుడు టీవీ9 ఏబీఎన్ లను కక్ష సాధించిన మాట వాస్తవం. ఆ చానల్స్ ను కేబుల్ లో రాకుండా నిలిపివేసిన మాట నిజం. అయితే అధికారంలోకి రాగానే తాను జగన్ కి భిన్నం ఏమీ కాదు అన్నట్లు లోకేష్ ఒక ఎంపీ ద్వారా ఏపీలోని కేబుల్ ఆపరేటర్లు అందరిని పిలిపించి తక్షణం టీవీ9, ఎన్టీవీ, సాక్షి టీవీ, 10 టీవీలను కేబుల్ నుంచి కట్ చేయాలని ఆదేశించారు . ఫోన్ చేసి అడిగితే నాకేంటి సంబంధం అని సమాధానం కూడా చెప్తున్నారు. గడచిన ఐదేళ్లు ఆ నాలుగు టీవీ చానల్స్ జగన్కు అనుకూలంగా వ్యవహరించాయని, టిడిపి కోసం ఏమి చేయలేదు కనుక తాము ఇప్పుడు అధికారంలోకి రాగానే వాటి నీ నిర్మూలించాలని, ఆ చానల్స్ బిజినెస్ ని దెబ్బతీయాలని లోకేష్ పట్టుదలగా ఉన్నారు.

ఒక ఛానల్ వలన, లేదు ఒక పేపర్ వలన ఒక పార్టీలు అధికారంలోకి రావడం, ఓ పార్టీ అధికారాన్ని కోల్పోవడం అంటూ జరిగితే… టిడిపికే కులపరమైన మీడియా సపోర్ట్ ఉంది. ఇది జగమెరిగిన సత్యం ఆ రకంగా చూస్తే మీడియా సపోర్ట్ ఉన్న టిడిపి ఏ ఎప్పుడు అధికారంలో ఉండాలి. అలా జరగలేదుగా? కానీ జగన్ ఏ కారణాల వల్ల ఓడిపోయాడు ఇప్పుడు వాటిని ఆదర్శంగా పెట్టుకుని ప్రతీకార పాలన చేయాలనుకుంటున్నారు చంద్రబాబు , లోకేష్. దాన్లో భాగమే చానల్స్ ని తొలగించడం. జగన్ పాలంలో జరిగిన అవినీతిని, తప్పుడు నిర్ణయాలను మార్చాల్సిందే. ఆ పేరుతో వ్యక్తుల్ని సంస్థల్ని వేధించడం దుర్మార్గం. ఇంకా జగన్ కి చంద్రబాబుకి తేడా ఏముంది? నిజానికి ప్రాంతీయ పార్టీలపాలన అన్నిచోట్ల నియంతృత్వ పాలనే. ప్రాంతీయ పార్టీలు ఉన్నచోట… రాజుగారు, యువరాజు గారు, రాజు గారి బంధువులు పాలన జరుగుతూ ఉంటుంది. కెసిఆర్, జగన్, చంద…