PAWAN KALYAN: పవన్‌కు అనారోగ్యం.. సమస్య ఇదే.. జనసైనికులకు సూచన

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఒకట్రెండు రోజుల్లోనే జ్వరం వచ్చి, స్వల్ప అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో పవన్ ఆరోగ్యంపై జనసైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఎందుకు తరచూ అనారోగ్యంపాలవుతున్నారని ఆయన అభిమానులు సందేహిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 20, 2024 | 08:10 PMLast Updated on: Apr 20, 2024 | 8:10 PM

Pawan Kalyan Health Update Announced By Janasena Party

PAWAN KALYAN: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తర్వాత వెంటనే పవన్ అనారోగ్యానికి గురయ్యారు. జ్వరం రావడంతో హైదరాబాద్ వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అనంతరం పవన్ మళ్లీ ప్రచారంలో పాల్గొంటున్నారు. అయినప్పటికీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఒకట్రెండు రోజుల్లోనే జ్వరం వచ్చి, స్వల్ప అస్వస్థతకు గురవుతున్నారు.

YS JAGAN-YS SHARMILA: జగన్‌ దగ్గర రూ.100 కోట్లు అప్పు తీసుకున్న షర్మిల.. ఇదే ఇద్దరినీ విడదీసిందా..?

దీంతో పవన్ ఆరోగ్యంపై జనసైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఎందుకు తరచూ అనారోగ్యంపాలవుతున్నారని ఆయన అభిమానులు సందేహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పవన్ ఆరోగ్య స్థితిపై కీలక ప్రకటన చేసింది. రికరెంట్ ఇన్‌ఫ్లుయంజా పవన్ ఊపిరితిత్తుల్లో నిమ్ముచేరి, అప్పుడప్పుడూ జ్వరానికి గురవుతున్నారని తెలిపింది. పవన్ అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. అభిమానులు గజమాలలు తేవొద్దని జనసేన రిక్వెస్ట్ చేసింది. అలాగే పవన్‌పై పూలు ఎక్కవగా జల్లొద్దంటూ కూడా కోరింది. షేక్ హ్యాండ్స్, ఫోటోల కోసం ఒత్తిడి చేయొద్దని జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, అభిమానులకు విజ్ఞప్తి చేసింది. పవన్ తన పర్యటన సమయంలో జాగ్రతగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రస్తుతం పవన్ అనారోగ్య సమస్యతోనే ప్రచారం కంటిన్యూ చేస్తున్నారు.

పవన్‌ ప్రచారం చేయడం కీలకమైన నేపథ్యంలో ఆయన అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రచారం చేస్తున్నారు. తన పార్టీతోపాటు కూటమి నేతల్ని గెలిపించుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. మరోవైపు పవన్ యాత్ర ఈ రోజు నిరాటంకంగా కొనసాగుతుంది. అయితే, వైసీపీ మాత్రం ఈ విషయంలో జనసేనానిపై తీవ్ర విమర్శలు చేస్తోంది. రెండు రోజులు ప్రచారం చేస్తే.. జ్వరం వచ్చి.. పవన్ పిఠాపురం వదిలి హైదరాబాద్‌కు వెళ్తారని అధికార వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.