Pawan Kalyan : తొలిసారి ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టుకు పవన్ కల్యాణ్
ఆంధ్ర్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తెలిసారి తెలంగానలో అడుగుపెట్టారు. దీంతో జనసైనికులు, పవన్ అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు.

Pawan Kalyan to Kondagattu as Deputy CM of AP for the first time
ఆంధ్ర్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తెలిసారి తెలంగానలో అడుగుపెట్టారు. దీంతో జనసైనికులు, పవన్ అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి కొండగట్టుకు వెళ్లే మార్గంలో పవన్ కు స్వాగతం ఘన స్వాగతం పలికారు. మరోవైపు సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి వద్ద కూడా జనసేన అధినేతకు ఘన స్వాగతం పలికారు. గతంలో మూడు సార్లు కొండగట్టు అంజన్నను పవన్ దర్శించుకున్నారు. గత ఏడాది ఏపీ ఎన్నికల ముందు వారాహి వాహనానికి కొండగట్టులో పవన్ ప్రత్యేక పూజలు చేయించారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు. 11 రోజుల పాటు నిష్టతో ఈ దీక్షను పాటించనున్నారు. మరోవైపు రాజకీయ నేత నుంచి ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కొండగట్టు అంజన్న స్వామి దర్శనం చేసుకున్నారు.