Top story: క్యాడర్ నీ, లీడర్లనీ పట్టించుకోని పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ప్రచారం చేసినంత కాలం అటు జనానికి ఇటు ఆయన పార్టీ నేతలకు చాలా అంచనాలు ఉండేవి. ఏపీలో కూటమి సర్కారు ఏర్పడగానే రాష్ట్రంలో ఊహించని మార్పులు వస్తాయని... అసలు పవన్ కళ్యాణ్ సినిమాలో సీఎం లా అనుకున్నవన్నీ నిమిషాల్లో చేసేస్తారని జనం రకరకాలుగా ఊహించుకున్నారు.
పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ప్రచారం చేసినంత కాలం అటు జనానికి ఇటు ఆయన పార్టీ నేతలకు చాలా అంచనాలు ఉండేవి. ఏపీలో కూటమి సర్కారు ఏర్పడగానే రాష్ట్రంలో ఊహించని మార్పులు వస్తాయని… అసలు పవన్ కళ్యాణ్ సినిమాలో సీఎం లా అనుకున్నవన్నీ నిమిషాల్లో చేసేస్తారని జనం రకరకాలుగా ఊహించుకున్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడ్డాక సీన్ మరోలా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు క్షణం తీరిక లేకుండా పని చేస్తుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులోకి రావడంలేదని విమర్శ బాగా వినిపిస్తోంది.
సినిమాల్లో హీరోగా చేయడం వేరు, ఒక రాజకీయ నాయకుడిగా నిత్యం జనంలో ఉంటూ…. పాలన వ్యవహారాలు చూడడం వేరు. సినిమా హీరోకి వెనక 100 మంది వందిమాగదులు ఉంటారు. పైనుంచి కింద వరకు అందరూ హీరోని చూసి వనికిపోతూ ఉంటారు. ఎక్కడలేని గౌరవాన్ని తెచ్చి పెట్టుకుని… హీరోని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ పాలిటిక్స్ లో అలా ఉండదు. పదవిలో ఉండే వాళ్ళకి పరిస్థితి ఇంకా దుర్భరంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు ఆ తేడా బాగా తెలుస్తుంది. సినిమా హీరోగా షూటింగ్ స్పాట్ లో ఉన్న లేకపోయినా అసలు పవన్ స్టైలే వేరుగా ఉండేది. కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా , పంచాయతీరాజ్., రూరల్ డెవలప్మెంట్, ఫారెస్ట్ కారణం ఎన్విరాన్మెంటల్ సైన్స్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం కత్తి మీద సాములా ఉంది.
కారణం గతంలో ఆయన ఇంత ఒత్తిడితో, క్రమశిక్షణతో, రకరకాల షెడ్యూల్స్ తో పని చేసి ఉండకపోవడమే. ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు షూటింగ్… ఆయన నో అంటే ప్యాకప్. కానీ ఇక్కడ అలా కాదు. అధికారులు వెంటపడుతూ ఉంటారు. షెడ్యూల్ ప్రకారం ఎప్పటికప్పుడు అన్ని పనులు చేయాలి. అంతేకాదు చాలా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ కున్న విషయపరిజ్ఞానంతో పోలిస్తే ఆయన మంత్రిత్వ శాఖ లు చాలా భారమైనవి. బాగా స్టడీ చేయాల్సి ఉంటుంది. సబ్జెక్టు మీద అవగాహన పెంచుకోవాలి. అందుకే పవన్ కళ్యాణ్ ఎక్కువ గంటలు పని చేయలేకపోతున్నారు. అధికారులతోనూ ఎక్కువసేపు గడపలేకపోతున్నారు. మరోపక్క జలుబు ,దగ్గు ,జ్వరం ,నడుం నొప్పి పవన్ కళ్యాణ్ ని వేధిస్తున్నాయి. అధికారులకు వెంటవెంటనే పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్స్ దొరకడం లేదు. ఇక జనసేన పార్టీ విషయానికొస్తే ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ అధికార కార్యక్రమం ఒక్కసారి కూడా పెట్టలేదు. ఒక్క కార్యకర్త తో కూడా ఈరోజు వరకు మాట్లాడలేదు. ఒక్క జిల్లా కూడా రివ్యూ చేయలేదు. ఎప్పుడైనా ప్రభుత్వ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు వస్తే వచ్చినట్లు… లేదంటే లేదు. అది కూడా ఆయన పట్టించుకోవడం లేదు.
అసలు పార్టీ నేతలకు ఈరోజు వరకు ఒక్క అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఆయన ఒక్కరిని కూడా కలవలేదు. అసలు ఏ జిల్లాలో జనసేన పార్టీ ఎలా ఉందో రివ్యూ చేయలేదు. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి అయితే మరీ దారుణం. తన దగ్గరికి వాళ్ళని అనుమతిస్తే గొంతెమ్మ కోరికలు కోరుతారేమో అని అనుకున్నారు ఏమిటో… ఒక్క ఎమ్మెల్యే కి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అసలు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఆయన్ని కలవాలంటే అది మామూలు కసరత్తు కాదు. ఇక టిడిపి ఎమ్మెల్యేలు సంగతి సరేసరి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా… ఆయన దగ్గర మూడు శాఖలు ఉన్నాయి కదా అని పడిగాపులు పడుతూ వచ్చారా మూడు నాలుగు రోజుల వరకు మీకు గేట్లు కూడా తీయరు. ఎక్కడ ఎవర్ని కలిస్తే ఏం హామీలు ఇవ్వాల్సి ఉంటుందో…. నాకెందుకు వచ్చిన ఈ దురద అని పవన్ కూటమిలో ఎమ్మెల్యేలకు అసలు సమయం ఇవ్వట్లేదు అంట. పవన్ దర్శనం టిడిపి ఎమ్మెల్యేలకు లేదు, జనసేన ఎమ్మెల్యేలకు అసలే లేదు. ఒకప్పుడు ఆయన హీరోగా ఉన్నప్పుడు, జనసేన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన రూమ్ బయట రోజుల తరబడి కొందరు వేచి చూస్తూ ఉండేవారట.
ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. పవన్ కళ్యాణ్ తాను కలవాలనుకుంటే అపాయింట్మెంట్ ఇస్తారు లేదంటే లేదు. ప్రస్తుతం జనసేన లోను, ప్రభుత్వంలోనూ ఇదే చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యేలు గానీ, జనసేన కార్యకర్తలు గానీ ఎవ్వరికి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ దొరకడం లేదు. కనీసం జిల్లాల్లో జనసేన పార్టీని బలోపేతం చేయాలి… కొత్త చేరికలు ప్రోత్సహించాలి… అధికారంలో ఉన్నప్పుడే పార్టీని అభివృద్ధి చేసుకోవాలి అన్న ధ్యాస కూడా పవన్ కళ్యాణ్ లో గాని ఆయన చుట్టూ ఉన్న వాళ్ళలో గాని కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ కి బాగా సన్నిహితులైన వాళ్ళు కొందరు బయటకు వచ్చి జోక్లేస్తున్నారట. మా బాస్ సంగతి తెలుసుగా… ఆయనకు మూడొచ్చినప్పుడే ఏదైనా చేస్తారు అని. ప్రస్తుతానికైతే జనసేన టిడిపి ఎమ్మెల్యేలకు, జనసేన కార్యకర్తలకు అపాయింట్మెంట్స్ లేవు అని నిక్కచ్చిగా చెప్పేస్తున్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చుట్టూ ఉండేవాళ్ళు.
పవన్ కళ్యాణ్ కి ఏమో… ఈ వాతావరణం అంతా తిక్కతిక్కగా ఉంది. ఏ నిర్ణయం తీసుకుంటే ఏం కొంపమునుగుతుందో మనకెందుకు తొందర, చంద్రబాబు నాయుడు చూసుకుంటున్నాడు గా అన్నట్లు ఉన్నాడు ఆయన. అడ్మినిస్ట్రేషన్ చూడక, పార్టీ వ్యవహారాలు పట్టించుకోక అసలు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అనేది ఇప్పుడు జనసేన లో పెద్ద చర్చ. పవర్ లోకి వచ్చాక ఎందుకో పవర్స్టార్ వేగం తగ్గిపోయింది. తాను ఇచ్చిన హామీలు నెరవేర్చక లేక పోతున్నానని నిరాశలో ఉన్నారో ఏమో పవన్ కళ్యాణ్ మాత్రం ఎమ్మెల్యేలకు, పార్టీ క్యాడర్ కు అందరికీ అందుబాటులో మాత్రం రావడం లేదు. దీనిపై అమరావతిలో ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఎలా పడితే అలా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వంలో ఏం జరుగుతుందో పవన్ కి సమాచారం ఉండట్లేదు, ఆయనకు అవగాహన లేదు. తాను జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనుకున్నాడు, వైసీపీని అధికారం నుంచి దించాలనుకున్నాడు ఆ పని పూర్తి చేసేసాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మాత్రం పవన్ కు అవగాహన రావడం లేదు.
ఆ విషయం అతను గుర్తించకుండా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ని ప్రశంసిస్తూ ఆయన వల్లే ప్రభుత్వం వచ్చిందని వీలైనన్ని సార్లు చెబుతూ పవన్ నీ హ్యాపీగా ఉంచుతున్నారు. బెజవాడ వరదలు వచ్చి… లక్షల మంది జనం ఆస్తులు నీట మునిగిపోతే పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా పరామర్శించడానికి రాలేదు. పైగా నేను వస్తే సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుంది అని తెలివిగా తప్పించుకున్నాడు .కానీ ఇవన్నీ జనం గమనిస్తూనే ఉన్నారు. పార్టీ క్యాడర్ అందుబాటులో లేని తమ అధినేత గురించి చర్చిస్తూనే ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలు అయితే సరే సరి. కనీసం కలిసి వెళ్లడానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఎలా అని బాధ పడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా హీరో ఇమేజ్ నుంచి బయటపడి మాస్ లీడర్ ఇమేజ్ను సంపాదించుకోవడానికి, జనంలో చొరవగా తిరగడానికి ఇంకా మరి కొంతకాలం పట్టొచ్చు.