Dwarampudi : ద్వారంపూడిని రోడ్డు మీద ఈడ్చుకెళ్తాం.. పవన్ కల్యాణ్ అన్నంత పనీ చేశాడుగా

కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే రేషన్ ధాన్యం విదేశాలకు పంపిన కేసులతో పాటు ఇప్పుడు అక్రమ కట్టడాలపైనా యాక్షన్ మొదలైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 4, 2024 | 02:35 PMLast Updated on: Jul 04, 2024 | 2:35 PM

Pawan Kalyan Who Was Dragged On The Dwarampudi Road Did The Same Thing

కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే రేషన్ ధాన్యం విదేశాలకు పంపిన కేసులతో పాటు ఇప్పుడు అక్రమ కట్టడాలపైనా యాక్షన్ మొదలైంది. ఒకప్పుడు… ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ చేసిన ఛాలెంజ్ ని జనసైనికులు గుర్తు చేసుకుంటున్నారు.

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై అప్పట్లో జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వీడియో మళ్ళీ వైరల్ అవుతోంది. వైసీపీ హయాంలో బియ్యం అక్రమ రవాణా, భూముల ఆక్రమణలు, తన అనుచరులతో అమ్మాయిలపై దౌర్జన్యాలు చేసినట్టు ఆరోపణలున్నాయి. పిఠాపురంలో డిప్యూటీ సీ‎ఎం హోదాలో పవన్ కల్యాణ్ పర్యటిస్తున్న వేళ… కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలపై వేట మొదలైంది. ఆయన అనుచరుడు అక్రమంగా స్థలం ఆక్రమించి నిర్మించిన భవనాన్ని కూలగొడుతున్నారు మున్సిపల్ అధికారులు. ఆ టైమ్ లో ద్వారంపూడి వీరావేశంతో మున్సిపల్ సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన అనుచరులు కొందరు రాళ్ళ దాడికి దిగారు. దాంతో ద్వారంపూడిని ఈడ్చుకొని వెళ్ళిపోయారు పోలీసులు. ఈ బిల్డింగ్ నిర్మాణంపై గతంలోనే మున్సిపల్ అధికారులు నోటీసులిచ్చారు. స్పందించకపోవడంతో కూల్చివేతలకు దిగారు. ఈ సంఘటనపై రౌడీ ద్వారంపూడి అంటూ ట్విట్టర్ లో టార్గెట్ చేస్తూ పోస్ట్ పెట్టింది టీడీపీ.

అంతకుముందు కాకినాడ పోర్టు నుంచి బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేస్తూ దొరికిపోయింది ద్వారంపూడి కుటుంబం. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం విదేశాలకు తరలించడంపై సివిల్ సప్లయీస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సీరియస్ అయ్యారు. కాకినాడలో విశ్వప్రియ ఎక్స్ పోర్ట్స్ గోడెన్ లో అక్రమంగా నిల్వ చేసిన 4 వేల 700 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేయించారు. గత 5 యేళ్ళ వైసీపీ హయాంలో వేల కోట్ల రేషన్ బియ్యాన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేసినట్టు ఆధారాలతో సహా వివరాలు సేకరించారు నాదెండ్ల మనోహర్. ఆ ఫైల్ ను ఇప్పటికే చంద్రబాబు ముందు పెట్టినట్టు సమాచారం. దాంతో ద్వారంపూడితో పాటు ఆయన కుటుంబసభ్యులు, అనుచరుల మెడకు ఉచ్చు బిగిసుకున్నట్టే అంటున్నారు. ద్వారంపూడి బియ్యం దందాలో మాజీ మంత్రులు కొడాలి నాని, కానుమూరి నాగేశ్వరరావు ప్రమేయం ఉందని భావిస్తున్నారు. వాళ్ళని కూడా జైలుకు పంపే అవకాశాలున్నాయి. పవన్ కల్యాణ్ అన్నమాట నిలబెట్టుకుంటున్నాడని జనసైనికులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.