Pawan Kalyan : 28ఏళ్ల తర్వాత ఫస్ట్ హీరోయిన్‌ను కలిసిన పవన్.. సుప్రియ ఏం గిఫ్ట్ ఇచ్చిందంటే..
తెలుగు సినీ నిర్మాతలు.. డిప్యూటీ సీఎం పవన్‌తో భేటీ అయ్యారు. విజయవాడ క్యాంపు ఆఫీస్‌లో ఈ సమావేశం జరిగింది. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు నిర్మాతలు శుభాకాంక్షలు తెలిపారు.

Pawan met his first heroine after 28 years.. What gift did Supriya give him..
తెలుగు సినీ నిర్మాతలు.. డిప్యూటీ సీఎం పవన్‌తో భేటీ అయ్యారు. విజయవాడ క్యాంపు ఆఫీస్‌లో ఈ సమావేశం జరిగింది. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు నిర్మాతలు శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ భేటీలో అశ్వినీదత్, అల్లు అరవింద్, దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతలతో పాటూ పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ హీరోయిన్ సుప్రియ కూడా పార్టిసిపేట్ చేసింది. పవన్‌తో కలిసి ఆమె దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి మూవీతో పవన్ కల్యాణ్.. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో.. పవన్ సరసన సుప్రియ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ఒక్క సినిమా చేసిన సుప్రియ.. ఆ తర్వాత మూవీస్‌కు పూర్తిగా దూరమయింది.
ఇప్పుడు పలు తెలుగు సినిమాలు నిర్మిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీకి చెందిన ఈమె.. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ తో జరిగిన ప్రొడ్యూసర్స్ మీటింగ్ లో సుప్రియ సైతం పాల్గొంది. ఈ సందర్భంగా పవన్ తో ఆమె దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిర్మాతలతో పాటు పవన్‌తో మీటింగ్‌లో పాల్గొన్న సుప్రియ.. ఆ తర్వాత ప్రత్యేకంగా ఆయనతో కలిసి ఫొటో దిగారు.
28ఏళ్ల తర్వాత ఫస్ట్ హీరోయిన్‌తో పవన్ అంటూ.. జనసేనికులు, పవన్ ఫ్యాన్స్.. ఆ ఫొటోను వైరల్ చేస్తున్నారు. పవన్‌తో కాసేపు ముచ్చటించిన సుప్రియ.. ఇండస్ట్రీ గురించి చర్చించారు. ఆ తర్వాత ఫొటో దిగే సమయంలో.. పవన్‌కు స్పెషల్ బుక్ కూడా సుప్రియ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక అటు టికెట్ రేట్ల విషయంలోనే పవన్‌తో నిర్మాతలు ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. పవన్‌తో కలిసి నిర్మాతలంతా త్వరలో సీఎం చంద్రబాబును కలవబోతున్నారని తెలుస్తోంది.