Pawan Kalyan : జనసేన MLAలతో పవన్ భేటీ.. జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఏకగ్రీవం

జనసేన శాసనసభా పక్ష నేతగా (Legislature Party Leader) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎన్నికయ్యారు. ఈరోజు(మంగళవారం) ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 11, 2024 | 01:32 PMLast Updated on: Jun 11, 2024 | 1:32 PM

Pawan Met With Janasena Mla Pawan Kalyan Is Unanimous As Janasena Legislative Party Leader

 

 

 

జనసేన శాసనసభా పక్ష నేతగా (Legislature Party Leader) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎన్నికయ్యారు. ఈరోజు(మంగళవారం) ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలలో తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar).. జనసేన శాసనసభా పక్ష నాయకుడుగా పవన్ కల్యాణ్ పేరును ప్రతిపాదించారు. దీంతో సభ్యులందరూ ఏకగ్రీవంగా బలపరిచారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పార్టీ కీలక నేతలతో మంగళగిరి పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. చంద్రబాబు (Chandrababu) తో చర్చించే అంశాలపై నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వంలో ఏ శాఖలు కోరాలి అనే అంశంపై చర్చించారు. జనసేన (Janasena) తరపున 4 మంత్రి పదవులకు అవకాశం కల్పిస్తారని సమాచారం. కాగా రేపు విజయవాడలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ (BJP) నేతల సమావేశం జరగనుంది. కాగా జనసేన అధినేత తొలిసారి శాసనసభలో అడుగు పెడుతున్నారు.