Pawan Kalyan : నేడు ఉత్తరాంధ్ర జిల్లాలో పవన్ సుడిగాలి పర్యటన.. పార్టీ ముఖ్య నేతలతో భేటీ..
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు (AP Assembly Elections) ఎక్కువ సమయం లేదు.. ఎవరికి వారు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాశారు. తమతమ వ్యూహాలను ప్రత్యర్థులపై ఎక్కుపెడుతున్నారు. తాజా జనసేన అధినేత పవన్ కూడా తమ పార్టీ నేతలలో సమావేశం కానున్నారు.

Pawan Sudigali tour in Uttarandhra district today..Meeting with the main leaders of the party..
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు (AP Assembly Elections) ఎక్కువ సమయం లేదు.. ఎవరికి వారు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాశారు. తమతమ వ్యూహాలను ప్రత్యర్థులపై ఎక్కుపెడుతున్నారు. తాజా జనసేన అధినేత పవన్ కూడా తమ పార్టీ నేతలలో సమావేశం కానున్నారు.
ఇక విషయంలోకి వెళితే.. నేడు ఉత్తరాంధ్ర ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు. పార్టీ ముఖ్య నేతలతో జనసేన (Janasena) చీఫ్ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సమావేశం కానున్నారు. ఉత్తరాంధ్ర జనసేన నేతలతో నిన్న జరగాల్సిన పవన్ కళ్యాణ్ సమావేశం నేటికి వాయిదా పడింది. ఇవాళ పార్టీ నేతలతో ఆయన విడివిడిగా భేటీ కానున్నారు. అలాగే రేపు, ఎల్లుండి భీమవరంలో పర్యటిస్తారు. టీడీపీ(TDP), జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల సన్నద్ధతపై చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. జనసేనలో టికెట్ ఆశావహులకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మూడు పార్టీల పొత్తు కారణంగా సీట్ల సర్దుబాటులో ఆశించిన వాళ్ళందరికీ అవకాశం రాకపోవచ్చనే విషయం చెప్పే ఛాన్స్ ఉంది. మధ్యాహ్నం తర్వాత పవన్ రాజమండ్రి వెళ్లనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నేతలతో రాజమండ్రిలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. కీలక నేతలతో ఎన్నికల గురించి చర్చించనున్నట్లు సమాచారం. సాయంత్రం ప్రత్యేక విమానంలో పవన్ కల్యాణ్ మంగళగిరి వెళ్లనున్నారు.
ఈ తరుణంలోనే.. పొత్తులపై బీజేపీ(BJP), టీడీపీ, జనసేన పార్టీలు నిర్ణయం తీసుకుంటాయని మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ తెలిపారు. పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేనకు మూడో వంతు సీట్లు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఊరిలో లేనందున అనకాపల్లిలో నాగబాబు నిర్వహించిన సమావేశానికి వెళ్లలేదని తెలిపారు. నాగబాబుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.