Telugu states CMs : సీఎంల మీటింగ్‌కు పవన్ దూరం.. చంద్రబాబు తొక్కేస్తున్నారా ?
తెలుగు రాష్ట్రాలకు కొత్త ముఖ్యమంత్రులు.. కొత్త సమావేశాలు.. కొత్తగా ప్రగతిభవన్.. ఇన్ని కొత్తల మధ్య కొత్తకొత్తగా సాగింది ఇద్దరు సీఎంల సమావేశం. ఏపీ తరఫున సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరయారు.

Pawan's absence from the CM's meeting.. Is Chandrababu trampling?
తెలుగు రాష్ట్రాలకు కొత్త ముఖ్యమంత్రులు.. కొత్త సమావేశాలు.. కొత్తగా ప్రగతిభవన్.. ఇన్ని కొత్తల మధ్య కొత్తకొత్తగా సాగింది ఇద్దరు సీఎంల సమావేశం. ఏపీ తరఫున సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరయారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌తో పాటు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్ ఎక్కడికి వెళ్లినా.. డిప్యూటీ సీఎం భట్టిని వెంటపట్టుకొని వెళ్తున్నారు.
ఈ మీటింగ్‌లోనూ భట్టి పాల్గొన్నారు. మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడ.. ఎందుకు రాలేదు.. చంద్రబాబు ఇప్పటి నుంచే తొక్కడం మొదలుపెట్టారా.. అసలు పవన్ గైర్హాజరుకు కారణం ఏంటి అనే చర్చ మొదలైంది. జనసేన ప్రతినిధిగా మంత్రి కందుల దుర్గేష్ సమావేశానికి వచ్చారు. ఓ సినిమాటోగ్రఫీ, టూరిజం మంత్రికి.. ముఖ్యమంత్రుల భేటీతో సంబంధం ఏంటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఐతే పవన్ రాకపోవడంపై సోషల్ మీడియాలో కొత్త ప్రచారం కూడా స్టార్ట్ అయింది. విభజన సమస్యలపై అవగాహన లేకపోవడంతోనే పవన్ సమావేశానికి దూరంగా ఉన్నారా.. లేదంటే నాలుగు రోజులుగా ఫీల్డ్ విజిట్స్‌తో అలసిపోయారా… లేదంటే చంద్రబాబే పవన్‌ను ఈ సమావేశానికి దూరంగా ఉంచారా. జనాల్లో, అభిమానుల్లో రకరకాల చర్చ జరుగుతోంది. ఇంకొందరు అయితే ఓ అడుగు ముందుకేసి… చంద్రబాబు గేమ్ ప్లాన్ మొదలైంది అంటూ చర్చ మొదలుపెట్టారు.
ఢిల్లీ పర్యటన నుంచి చంద్రబాబు నేరుగా హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులతో వరుస భేటీ నిర్వహించారు. ఐతే ఢిల్లీ టూర్‌కు కూడా పవన్‌ను చంద్రబాబు దూరమే పెట్టారు. ఇక పింఛన్ల యాడ్ ఇచ్చారు. అందులోన బాబు తప్ప పవన్ కనిపించలేదు. ఇప్పుడు చివరకు రాష్ట్ర విభజన సమస్యల మీద రేవంత్‌రెడ్డితో భేటీ ఏర్పాటు చేస్తే.. పవన్ కల్యాణ్ కనిపించకపోవడం కొత్త చర్చకు తావిస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇదంతా ఎలా ఉన్నా.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తొలి సమావేశానికి పవన్ వచ్చి ఉంటే బాగుండేదని జనసేన అభిమానులు, పవన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.