Pavan Photos : పవన్ కి ప్రియారిటీ మామూలుగా లేదు.. ఆఫీసుల్లో బాబు పక్కనే పవన్ ఫోటో
ఏపీ డిప్యూటీ సీఎంగా (AP Deputy CM) నాలుగు కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్ కి మరో అరుదైన గౌరవం దక్కింది. ఏపీలో కూటమి విజయం వెనుక పవర్ స్టార్ (Power Star) మేనియా ఉందన్నది అందరికీ తెలుసు.

Pawan's priority is not usual.. Pawan's photo next to Babu in the office
ఏపీ డిప్యూటీ సీఎంగా (AP Deputy CM) నాలుగు కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్ కి మరో అరుదైన గౌరవం దక్కింది. ఏపీలో కూటమి విజయం వెనుక పవర్ స్టార్ (Power Star) మేనియా ఉందన్నది అందరికీ తెలుసు. అందుకే 5యేళ్లుగా పవర్ లేక ఇబ్బంది పడ్డ చంద్రబాబు నాయుడు… పవన్ కల్యాణ్ కి ప్రభుత్వంలో సముచిత గౌరవం ఇస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసుల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇకపై ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడి ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫోటో కూడా పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి i & pr అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు (CM Chandrababu). గతంలో ఉన్న జగన్ ఫోటోలను ఇప్పటికే అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో తీసేశారు. వాటి స్థానంలో బాబుతో పాటు పవన్ ఫోటోలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో కూడా తన గది పక్కనే పవన్ ఛాంబర్ ఉండేలా బాబు ఆదేశాలు ఇచ్చారు. సచివాలయంలో ఫస్ట్ ఫ్లోర్ లో సీఎం ఛాంబర్ ఉంటుంది.
గతంలో ఈ గది పక్కనే చంద్రబాబు RTGS ఛాంబర్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని పవన్ కల్యాణ్ కి కేటాయించబోతున్నారు. సాధారణంగా సీఎం ఉన్న ఫ్లోర్ కి సెక్యూరిటీ కట్టుదిట్టంగా ఉంటుంది. పవన్ కి కూడా ఆ స్థాయిలో సెక్యూరిటీ ఉండాలన్న ఉద్దేశ్యంతో ఫస్ట్ ఫ్లోర్ లోనే ఛాంబర్ రెడీ అవుతోంది. పవన్ కల్యాణ్ కి ఇచ్చిన పదవికి గౌరవాన్ని కల్పించేందుకే మరో వ్యక్తికి డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వలేదు చంద్రబాబు. తనతో సమానంగా పవన్ కు గౌరవం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఆఫీసుల్లో పవన్ ఫోటో, సెక్రటేరియట్ లో.. తన గది పక్కనే ఛాంబర్ ఇస్తుండటంతో… జనసైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులు ఫుల్లు హ్యాపీగా ఉన్నారు.